News March 1, 2025
ADB ఇంటర్ బోర్డు అధికారిగా జాధవ్ గణేశ్

ఆదిలాబాద్ ఇంటర్ బోర్డు అధికారిగా (DIEO) GJC ప్రిన్సిపల్ జాధవ్ గణేశ్ కుమార్‌ను నియమిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు DIEOగా ఉన్న రవీందర్ కుమార్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో గణేశ్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం DIEOగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పి స్వాగతించారు.
Similar News
News March 3, 2025
ఆదిలాబాద్: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3న సోమవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు.
News March 3, 2025
ఆదిలాబాద్: జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

వేసవి ప్రారంభంలోనే జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆదివారం బేల మండలంలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండలో నుంచి ఉపశమనం పొందేందుకు కూలర్లను వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. వచ్చే రెండు మూడు రోజుల్లో మరింత ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News March 2, 2025
ఆదిలాబాద్: భార్య మందలించిందని భర్త SUICIDE

భార్య మందలించిందని ఓ భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు 2 టౌన్ ఏఎస్ఐ ముకుంద్ రావు తెలిపారు. మహారాష్ట్ర కిన్వాట్ తాలూకా దైహిలీకు చెందిన నూకల్వర్ ఓం ప్రకాశ్(35) మద్యానికి బానిస అయ్యాడు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందని భార్య మందలించింది. దీంతో శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.