News February 11, 2025

ADB ఐటీ టవర్ పనులను పూర్తి చేయాలి : మాజీ మంత్రి

image

ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన ఐటీ టవర్ అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జయేశ్ రంజన్ ను హైదరాబాద్‌లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఐటీ పరిశ్రమలను పట్టణాలకు విస్తరించాలని గత ప్రభుత్వం జిల్లాకు 2022లో ఐటీ టవర్ మంజూరు చేసిందన్నారు. కానీ ఇప్పటికి పనులు పూర్తి కాలేదన్నారు.

Similar News

News March 14, 2025

ADB: 16న ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్‌లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News March 14, 2025

ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్టు

image

ఈనెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వేదికగా జరగనున్న రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు గొప్ప క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించాలని సూచించారు. జిల్లా పేరును నిలబెట్టాలని ఆకాంక్షించారు.

News March 14, 2025

ఆదిలాబాద్ ప్రజలకు హొలీ శుభాకాంక్షలు: కలెక్టర్

image

శుక్రవారం జరుపుకొనే హోలీ పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ సంవత్సరం పాల్గుణ మాసం పౌర్ణమి రోజున దేశ వ్యాప్తంగా పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు అందరూ ఆనందోత్సవాలతో, సంతోషంగా హోలీని సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్నారు. పిల్లలు రంగులు చల్లుకొనే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

error: Content is protected !!