News May 13, 2024
ADB: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!
ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో 2019లో 71.42 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లి ఎంపీ స్థానంలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.
Similar News
News January 22, 2025
ADB: భారత జట్టులో ఆదిలాబాద్ ఉద్యోగి
దిల్లీలో నిర్వహించిన ఖోఖో అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ట్రోఫీ అందుకున్న టీంలో సభ్యుడిగా ఆదిలాబాద్ తపాలా ఉద్యోగి ఉన్నారు. తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆదిలాబాద్ పోస్టల్ అసిస్టెంట్ శివారెడ్డి భారత జట్టు తరఫున ఆడారు. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్ లోనే బెస్ట్ అటాకర్‌గా పేరు పొందారు. భారత ఖోఖో జట్టు విశ్వ విజేతగా నిలవడంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు తపాలా శాఖ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.
News January 22, 2025
ఏడాదిలో రూ.850 కోట్ల అభివృద్ధి: నిర్మల్ MLA
గడిచిన సంవత్సర కాలంలో నిర్మల్ నియోజకవర్గంలో రూ.850 కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మల్ మండలం వెంగ్వాపేట్, కౌట్ల, ముజ్గి తదితర గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.
News January 22, 2025
ఆదిలాబాద్: ట్యూషన్ ఫీజు చెల్లింపునకు అవకాశం
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 3వ సంవత్సరం, పీజీ 2వ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లింపునకు పొడిగించినట్లు ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ మంగళవారం పేర్కొన్నారు. ఈనెల 25 వరకు అవకాశం ఉందన్నారు. ట్యూషన్ ఫీజు చెల్లించనివారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.