News March 5, 2025

ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

image

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Similar News

News March 6, 2025

ఈ పరంపరని బ్రేక్ చేయాల్సిందే.. ఏమంటారు?

image

CT ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో IND తలపడనుంది. గ్రూప్ స్టేజీలోనే NZని ఇండియా చిత్తు చేసిందని, ఫైనల్‌లో గెలుపు మనదేనని కొందరు IND ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో జరిగిన కొన్ని టోర్నీలను మరికొందరు గుర్తుచేస్తున్నారు. 2017 CTలో గ్రూప్ స్టేజీలో పాక్‌ను ఓడించినా ఫైనల్‌లో అదే టీమ్‌పై ఇండియా ఓడిపోయింది. 2023 ODI WCలోనూ ఇలాగే AUS ఫైనల్స్‌‌లో మనల్ని ఓడించింది. ఈసారి ఇది బ్రేక్ కానుందా?

News March 6, 2025

చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలో చండూరు వాసులు

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా నల్గొండ జిల్లా చండూరుకి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసులు వారిలో ఉండడం విశేషం.

News March 6, 2025

సిద్దవటం: ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం

image

మండలంలోని ఉప్పరపల్లె గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. శేఖరాజుపల్లె రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే సంఖ్య 421/1, 424 లో ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది. ఇక్కడ సుమారు 50 సెంట్లను ఇటీవల స్థానికుడు యంత్రంతో చదును చేసి ఆక్రమించాడు. ఈ విషయమై ఇన్‌ఛార్జ్ MRO మాధవీ లతను వివరణ కోరగా చర్యలు తీసుకుంటామన్నారు.

error: Content is protected !!