News March 5, 2025
ADB: ఘోర రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం గిరిజ గ్రామానికి చెందిన 16 మంది మహారాష్ట్రలోని చంద్రపూర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బుధవారం మహారాష్ట్రలోని కోర్పణ వద్ద వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News March 6, 2025
తిరుమల అన్నప్రసాదంలో వడలు

AP: తిరుమల శ్రీవారి అన్నప్రసాదంతో పాటు మసాలా వడల పంపిణీని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. భక్తులకు ఆయన స్వయంగా వడ్డించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం అధికారులు తొలి రోజున 35వేల వడలను తయారుచేశారు. క్రమంగా ఈ సంఖ్యను లక్ష వరకు పెంచడానికి చర్యలు తీసుకోనున్నారు.
News March 6, 2025
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగివ్వాలి: జైశంకర్

పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి భారత్‌కు ఇస్తేనే అక్కడి సమస్య పరిష్కారమవుతుందని కేంద్రమంత్రి జైశంకర్ స్పష్టంచేశారు. భారత ప్రభుత్వం కశ్మీర్ అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. లండన్‌లోని ఛాఠమ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలన్నింటికీ సమాన అధికారాలు ఉండాలనే విధానంలో ట్రంప్ పాలన సాగుతోందని, భారత్‌కు అది సరిగ్గా సరిపోతుందని తెలిపారు.
News March 6, 2025
కర్నూలు: బొలెరో, బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం

నందవరం మండలంలోని జోహారాపురం గ్రామ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కురువ చదువుల చక్రవర్తి(23) వ్యక్తిగత పనుల మీద బైకుపై వెళ్తుండగా పోలకల్ నుంచి రాయచూర్‌కు కందులు తరలిస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో చక్రవర్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు జయమ్మ, పోసరప్ప కుమారుడిగా గుర్తించారు.