News April 4, 2025

ADB: ‘జిల్లాలో 27,432 మందికి రుణమాఫీ కాలే’

image

రుణమాఫీ కాలేక రైతు భరోసా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతు స్వరాజ వేదిక జిల్లాధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. జిల్లాలో 27,432 మంది రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. గురువారం బోథ్‌లో ఆయన మాట్లాడారు. అటు రైతు భరోసా రాకపోవడంతో రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి రుణమాఫీ, రైతు భరోసా కల్పించాలని కోరారు. రైతులు రామ్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 11, 2025

ఆదిలాబాద్: సర్టిఫికెట్ పొందేందుకు రేపే ఆఖరు

image

ఐటీఐలో ఏదైన ట్రేడ్‌కు సంబంధించి మూడేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు సర్టిఫికెట్ పొందేందుకు ఈనెల 12లోపు వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. 21 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అర్హులని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 11, 2025

ADB: దొంగతనం.. ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరార్

image

ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్‌కు చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

News April 11, 2025

ADB: దొంగతనం.. ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరార్

image

ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్ చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!