News April 16, 2025
ADB: ‘జొన్నల కొనుగోలులో ఇబ్బంది లేకుండా చూడాలి’

జొన్నల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కొనుగోలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లాలోని ప్రతి జొన్న రైతుకు మద్దతు ధర పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. అమ్ముతున్న వివరాలను పొందుపరచాలని మార్కెటింగ్ శాఖకు ఎప్పటికప్పుడు సమర్పించాలని సూచించారు.
Similar News
News April 19, 2025
ADB: ఈ నెల 20న MJP బ్యాక్ లాగ్ సెట్

ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర, బాలికల గురుకులాల్లోని 6,7,8,9 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు RCO శ్రీధర్ తెలిపారు. ఎంజేపీ బ్యాక్‌లాగ్ సెట్ ఈ నెల 20న ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,308 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష ప్రారంభమవుతుందని, గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News April 19, 2025
ADB: మళ్లీ జిల్లాకు వచ్చిన మన కలెక్టర్లు

గతంలో ADB జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు IASలు మళ్లీ జిల్లాకు వచ్చి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రామకృష్ణారావు, బుద్ధప్రకాశ్ జ్యోతి ఇద్దరు పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రామకృష్ణారావు, రెవెన్యూ(రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్) సెక్రటరీగా ప్రకాశ్ పనిచేస్తున్నారు.
News April 19, 2025
ఇకపై భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం: మంత్రి

ఎన్నికల వేల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం లభించనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ భారతి చట్టంపై భోరజ్ మండలం పూసాయిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించారు.