News February 22, 2025
ADB: బాలికపై అత్యాచారం.. ముగ్గురి అరెస్ట్: SP

తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవని ADB ఇన్‌ఛార్జ్ SP జానకి షర్మిల అన్నారు. బాలికపై << 15538444>>అత్యాచార <<>>ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిందితులు అనిల్, గంగాధర్, సుష్మలను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఎలాంటి సందేహం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. సోషల్ మీడియాలో వదంతులను వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News February 23, 2025
సోమవారం ప్రజావాణి రద్దు: ADB కలెక్టర్

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి వచ్చే సోమవారం 24న తేదిన ప్రజావాణి రద్దు చేసినట్లు ADB జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలిపారు. పట్టభద్రుల, ఉపాద్యాయ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు నిర్వహించడం, ఎన్నికలపై శిక్షణ తరగతులు ఇవ్వనున్నందున సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రజలు దీనిని గమనించి కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.
News February 23, 2025
ADB: నేడు ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష

ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-2026 విద్యాసంవత్సరానికి 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీల భర్తీకి ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో విద్యార్థుల కోసం అధికారులు పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు.
News February 23, 2025
ADB: విద్యార్థులకు అలర్ట్.. మోడల్ స్కూల్ దరఖాస్తులు

2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ మోడల్ స్కూల్‌లలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు (మిగిలిన సీట్లకు) దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తారీకు చివరి తేదీ అన్నారు. ప్రవేశ పరీక్ష తేదీ ఏప్రిల్ 13న ఉంటుందన్నారు. పరీక్ష ఫీజు SC, ST, BC, PHC& EWSలకు రూ.125, OC విద్యార్థులకు రూ.200 ఉంటుందన్నారు.