News April 3, 2025

ADB: బెల్ట్ షాపులపై పోలీసుల రైడ్.. నలుగురిపై కేసు

image

ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్, శ్రీరామ్ కాలనీలో బెల్ట్ షాపులపై తనిఖీ నిర్వహించారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయాలు చేసినందుకు వారిపై 2 టౌన్ పీఎస్‌లో కేసు నమోదు  చేసినట్లు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. నాలుగు దుకాణాల్లో పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.15,370 ఉందని పేర్కొన్నారు.

Similar News

News April 7, 2025

బెట్టింగ్.. నలుగురి అరెస్ట్: ADB SP

image

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ IPL బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.

News April 7, 2025

ADB: మహిళల బంగారు పుస్తెల తాళ్లు చోరీ: CI

image

పండుగ సందర్భంగా గుడికి వెళ్లిన మహిళల మెడల్లో నుంచి పుస్తెల తాళ్లు చోరీ అయిన ఘటన ADBలో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ సునీల్ వివరాల మేరకు.. తిర్పల్లికు చెందిన ఠాకూర్ పద్మజ, మావలకు చెందిన సుమ బ్రాహ్మణ సమాజ్ రామమందిర్‌లో పూజకు వెళ్లారు. క్యూలైన్లో నిలబడి భోజనాలు చేశారు. అనంతరం చూసుకుంటే పద్మజ, సుమ మెడలోని బంగారు పుస్తెల తాళ్లు కనబడలేదు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 7, 2025

ADB: వారంలో 8 సైబర్ మోసాలు: SP

image

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ ఫ్రాడ్, మొబైల్ హ్యాకింగ్ లాంటి సైబర్ నేరాలకు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. గత వారంలో జిల్లాలో 8 సైబర్ ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ఎటువంటి గుర్తు తెలియని స్కాం నంబర్లు, లింక్లు ఓపెన్ చేయొద్దన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైతే 1930కు కాల్ చేయాలని పేర్కొన్నారు.

error: Content is protected !!