News March 7, 2025
ADB: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఉక్కురిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికి వచ్చే ప్రమాదముంది. ADBలో గాలినాణ్యత విలువ 90గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
Similar News
News March 9, 2025
ADB: MLC రేసులో రేఖానాయక్?

కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖానాయక్ MLA కోటా MLC రేసులో ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల ముందు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవటంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఆమెకు అవకాశం దక్కలేదు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై అదిష్ఠానంతో చర్చించనున్నారు. ఎస్టీ కేటగిరీ నుంచి రేఖానాయక్‌కు అవకాశం దక్కుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే
News March 9, 2025
ADB: నేటి నుంచి గ్లాకోమా వారోత్సవాలు

ఈ నెల 9 నుంచి గ్లాకోమా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్లాకోమాతో బాధపడే 40 సంవత్సరాలు పైబడ్డ వారంతా ఆయా ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన దృష్టి లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
News March 9, 2025
ఉట్నూర్: ఈ నెల 16న ఈఎంఆర్ఎస్ ప్రవేశ పరీక్ష

ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్‌నగర్‌లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. విద్యార్థులు ఈ నెల 7 నుంచి ఆన్లైన్‌లో హాల్ టికెట్‌లను దరఖాస్తు చేసుకోవాలన్నారు.