News March 7, 2025
ADB: రూ.20లక్షల అప్పు.. అందుకే సూసైడ్!

నేరడిగొండలో<<15670214>> దంపతులు<<>> పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వడూర్‌కు చెందిన పోశెట్టి, ఇందిర దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారి పెళ్లి కోసం బ్యాంక్‌లో రూ.2లక్షలు, బయట రూ.18లక్షలు అప్పుచేశారు. ఈ క్రమంలో చిన్న కూతురు, అల్లుడు వచ్చి అప్పుల గురించి చర్చించగా ఇల్లు అమ్మేందుకు సిద్ధమయ్యారు. దీంతో మనస్తాపం చెంది వారు బుధవారం పురుగుమందు తాగగా పోశెట్టి మృతి చెందాడు. ఇందిర పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News March 9, 2025
ఖమ్మం: శ్రీ చైతన్య క్యాంపస్‌లో అవగాహన సదస్సు

పుట్టకోటలోని శ్రీ చైతన్య గ్లోబల్ క్యాంపస్ నందు ‘ఫ్యూచరిస్టిక్ గ్లోబల్ ఎడ్యుకేషన్ -బియాండ్ బౌండరీస్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విశ్రాంత సీబీఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ హాజరై AI, అంతర్జాతీయ విద్యా ప్రమాణాల గురించి వివరించారు. సదస్సులో 2 వేలకు పైగా ప్రముఖులు, తెలంగాణ శ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ మల్లంపాటి శ్రీధర్, ఏజీఎంలు, కోఆర్డినేటర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
News March 9, 2025
ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెంచాలి: మంత్రి

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మరింత వేగం పెంచాలని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా యుద్ధ ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. నిర్మాణం పూర్తైన 2BHK ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న వాటిని కాంట్రాక్టర్లు పూర్తి చేయని పక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
News March 9, 2025
NZB: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరి మృతి

ఎదురెదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నిజామాబాద్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సత్యనారాయణ(62) ఒక షోరూంలో నైట్ వాచ్ మెన్ డ్యూటీ చేసి ఇంటికి బైక్‌పై వెళుతుండగా త్రిమూర్తి ఎదురుగా మరో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు.