News August 21, 2025
రోజువారీ ఆహారంలో ఈ ఫుడ్స్ యాడ్ చేయండి!

మనం తీసుకునే ఆహారంలో కొన్నింటిని జోడించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ‘సజ్జలు తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడిపండ్లు తింటే కిడ్నీల్లోని రాళ్లు కరుగుతాయి. దానిమ్మ రసం కామెర్ల నివారణకు ఔషధంగా పనిచేస్తుంది. ఆవాలు క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ పెరుగుతుంది. అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గించి మలబద్ధకాన్ని వదిలిస్తుంది’ అని పేర్కొన్నారు. SHARE IT.
Similar News
News March 18, 2026
నేడు అకౌంట్లలోకి డబ్బులు

AP: పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో నేడు ప్రభుత్వం రూ.250 కోట్లు జమ చేయనుంది. ఉగాది కానుకగా CM చంద్రబాబు ఇవాళ కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందజేయనున్నారు. వీరికి గతేడాది సంక్రాంతికి రూ.980 కోట్లు, దీపావళికి రూ.1,000 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. 2016లో తాము రూ.700 కోట్లు ఇవ్వగా.. YCP హయాంలో ఒక్క రూపాయీ చెల్లించలేదని ఆరోపిస్తోంది.
News March 18, 2026
SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషనే ఎందుకు?

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్, నాయకత్వ లక్షణాల వల్లే అతడి వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపిందని సమాచారం. ఝార్ఖండ్ జట్టుకు తొలిసారి SMAT ట్రోఫీ అందించడంతోపాటు అద్భుత ఆటతో భారత జట్టులోకి ఇషాన్ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో బ్యాటింగ్‌లో తడబడుతున్న అభిషేక్‌తో పోలిస్తే ఇషాన్‌ను SRH ఫస్ట్ ఛాయిస్‌గా చూసినట్లు టాక్. మీరేమంటారు?
News March 18, 2026
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్‌లు ఇలా తీసుకోండి!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకానికి అమరావతిలో CM CBN శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గాల్లో MLAలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్‌పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ పొందొచ్చు. ఈ స్కీమ్‌తో రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలగనుంది.


