News April 7, 2025

పుండు మీద కారం.. గ్యాస్, పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్

image

గ్యాస్ సిలిండర్‌పై ₹50, పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు ₹2 పెంపుపై కాంగ్రెస్ ఫైరయ్యింది. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం వేశారని మండిపడింది. పుండు మీద కారం చల్లినట్లుగా కేంద్రం తీరు ఉందంది. ‘ఇవాళ ముడిచమురు ధర నాలుగేళ్ల కనిష్ఠానికి చేరింది. అయినా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించకుండా కేంద్రం పెంచింది. పైగా ప్రజలపై భారం పడదని డప్పు కొడుతోంది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News April 8, 2025

చైనాను హెచ్చరించిన ట్రంప్

image

చైనాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమపై విధించిన 34శాతం టారిఫ్‌ను వెనక్కి తీసుకోకపోతే డ్రాగన్ దేశంపై మరో 50శాతం సుంకం విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రేపటికల్లా పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 9నుంచి చైనా దిగుమతులపై అదనపు పన్ను ఉంటుందన్నారు. ట్రంప్ డ్రాగన్ వస్తువులపై 34శాతం టారిఫ్‌‌లు వేయగా, బీజింగ్ సైతం అంతే మెుత్తంలో US దిగుమతులపై సుంకాలు విధించింది.

News April 8, 2025

ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్

image

TG: డిగ్రీలో ఫెయిలైన విద్యార్థులకు జేఎన్టీయూ శుభవార్త చెప్పింది. అన్ని కోర్సుల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం వన్ టైమ్ ఛాన్స్ (స్పెషల్ సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. www.jntuh.ac.in సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

News April 7, 2025

బీజేపీ సంచలనం.. విరాళాల్లో టాప్

image

2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పార్టీలు పొందిన విరాళాలను ADR వెల్లడించింది. అన్ని పార్టీలకు రూ.2544.27 కోట్ల ఫండ్స్ రాగా, అందులో ఒక్క బీజేపీకే రూ.2,243 కోట్లు వచ్చాయి. మొత్తం విరాళాల్లో ఆ పార్టీకే 88శాతం వచ్చాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రూ.281.48 కోట్ల విరాళం పొందింది. AAP, సీపీఎం, నేషనల్ పీపుల్స్ లాంటి పార్టీలకు తక్కువ విరాళాలు రాగా, తమకు విరాళాలు రాలేదని బీఎస్పీ ప్రకటించింది.

error: Content is protected !!