News July 27, 2024
ఏపీకి అదనంగా 30 మంది ఐపీఎస్‌లు

AP: రాష్ట్రానికి అదనపు ఐపీఎస్‌లను కేటాయించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఐపీఎస్‌ల కొరత, ఇతర అంశాలపై వివరించారు. కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా మరింత మంది అధికారుల అవసరముందని విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ అదనంగా 30 మంది IPS అధికారుల్ని కేటాయించింది. దీంతో ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్‌లు సంఖ్య 174కి చేరనుంది.
Similar News
News November 1, 2025
ఓల్డ్ గూగుల్ క్రోమ్ వాడుతున్నారా?

ఓల్డ్ వెర్షన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని CERT-In హెచ్చరికలు జారీ చేసింది. పాత వెర్షన్లలో తీవ్రమైన భద్రతా లోపాలున్నాయని, దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం లీకయ్యే ప్రమాదముందని తెలిపింది. లైనక్స్, విండోస్, macOSలో 142.0.7444.59/60 కంటే ముందున్న వెర్షన్లు వాడుతుంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించింది.
News November 1, 2025
85% మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లు స్థానికులకే: దామోదర

TG: మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85 శాతం రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో జారీ చేయాలని హెల్త్ సెక్రటరీని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఇప్పటివరకూ మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆల్ ఇండియా కేటగిరీలో భర్తీ చేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318 మెడికల్ పీజీ, 70 డెంటల్ పీజీ సీట్లు దక్కనున్నాయి.
News November 1, 2025
లవ్ స్టోరీ చెప్పేసిన అల్లు శిరీష్

<<18163585>>నిశ్చితార్థం<<>> చేసుకున్న టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ తన లవ్ స్టోరీని ఇన్‌స్టాలో వెల్లడించారు. 2023లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహ సమయంలో నితిన్, శాలిని కందుకూరి ఇచ్చిన పార్టీలో నయనికను కలుసుకున్నట్లు తెలిపారు. అలా ప్రేమ మొదలవ్వగా సరిగ్గా రెండేళ్లకు ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు చెప్పారు. ‘‘భవిష్యత్తులో నా పిల్లలు మా కథ ఎలా ప్రారంభమైందని అడిగితే ‘ఇలానే మీ అమ్మను కలిశా’ అని చెబుతా’’ అంటూ రాసుకొచ్చారు.


