News April 11, 2025
పోసానిపై అదనపు సెక్షన్లు.. హైకోర్టు తీవ్ర ఆగ్రహం

AP: పోసాని కృష్ణమురళిపై కేసుల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనకు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని తాము ఆదేశించిన తర్వాత సెక్షన్ 111(వ్యవస్థీకృత నేరం) చేర్చడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని సూళ్లూరుపేట CIకి నోటీసులిచ్చింది. కాగా TTD ఛైర్మన్‌ను దూషించారంటూ TV5 సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదైంది.
Similar News
News January 26, 2026
THDCలో 100 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, BE, B.Tech, BBA అర్హతగల అభ్యర్థులు జనవరి 31వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thdc.co.in
News January 26, 2026
పాల దంతాలకు జాగ్రత్తలు

పసి పిల్లలకు 7-9 నెలల వయసు నుంచి పాలదంతాలు వస్తాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పళ్లు రావడం మొదలయ్యాక మృదువైన బ్రష్‌తో వాటిని శుభ్రం చెయ్యాలి. దురద, నొప్పి రాకుండా శుభ్రమైన క్లాత్‌ని కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి పిల్లలకు నోట్లో పెట్టుకోవడానికి ఇవ్వాలి. కొంతమందిలో ఈ దంతాలు వచ్చే సమయంలో జ్వరం, మోషన్స్ అవుతాయి. ఇవి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
News January 26, 2026
ఈ నెల 28న క్యాబినెట్ భేటీ

AP: సీఎం CBN అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 28న క్యాబినెట్ భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆయన 29న అరకులో పర్యటించనున్నట్లు చెప్పాయి. 30, 31వ తేదీల్లో కుప్పంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించాయి. అలాగే రేపు 4pmకు TDP కేంద్ర కార్యాలయానికి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అక్కడ పార్టీ సీనియర్ నాయకులతో భేటీ అవుతారని తెలుస్తోంది.


