News May 20, 2024
ఎన్నికల హింసపై కేసుల్లో అదనపు సెక్షన్లు: వినీత్ బ్రిజ్‌లాల్

AP: పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్లపై ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ వెల్లడించారు. పలు కేసుల్లో అదనపు సెక్షన్లు చేరుస్తున్నామని, మరికొంత మంది నిందితులను గుర్తించామని తెలిపారు. కాగా నివేదికను ఇవాళ ఉ.10 గంటలకు DGPకి, మధ్యాహ్నం CS ద్వారా CEO, CECకి అందజేయనున్నారు. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు మరింత గడువు కోరనున్నారు.
Similar News
News December 14, 2025
న్యూస్ అప్డేట్స్

✦ ‘పాలమూరు’ ఫేజ్-1కి అనుమతులు ఇవ్వాలని, ఏపీ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
✦ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
✦ తెలంగాణలో పురుషుల సగటు ఆయుర్దాయం (67) కంటే మహిళలదే (73) ఎక్కువ.. ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ 2022 డేటా ఆధారంగా నివేదిక ఇచ్చిన కేరళ వర్సిటీ
News December 14, 2025
అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు పీటర్ గ్రీన్(60) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. న్యూయార్క్‌లోని ఆయన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారని మేనేజర్ తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. అయితే అపార్ట్మెంట్లో ఎలాంటి సస్పెక్ట్ యాక్టివిటీస్ లేవని పోలీసులు తెలిపారు. ఎన్నో విలన్ పాత్రలతో గ్రీన్ ప్రేక్షకులను అలరించారు. పల్ప్ ఫిక్షన్, ది మాస్క్ చిత్రాలు ఆయనకు ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టాయి.
News December 14, 2025
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా గోయల్

నూతన ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రభుత్వ మాజీ ఉద్యోగి రాజ్‌కుమార్ గోయల్ అపాయింట్ అయ్యారు. ప్రధాని మోదీ సారథ్యంలోనే ముగ్గురు సభ్యుల కమిటీ ఈయన పేరును ఎంపిక చేసింది. మరో 8మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్లనూ ప్యానెల్ సిఫార్సు చేసింది. రేపు RK గోయల్‌తో CICగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఈయన అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం యూనియన్ టెరిటరీస్ క్యాడర్‌కు చెందిన 1990వ బ్యాచ్ IAS(రిటైర్డ్).


