News March 18, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్ @2111 పోలింగ్ కేంద్రాలు

image

ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం ఎస్టీ-1 కాగా.. మూడు జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌, బోథ్‌, నిర్మల్‌, మథోల్‌, ఖానాపూర్‌, సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ ఉండగా.. ఇందులో 16,44,715 మంది ఓటర్లు ఉన్న ట్లు ఎన్నికల అధికారి రాజర్షి షా వివరించారు. పురుషులు 8,02,575.. మహిళలు, 8,42,054, ఇతరులు 86, 2,085 మంది సర్వీస్‌ ఓటర్లు ఉండగా 2,111 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News April 11, 2025

ADB: దొంగతనం.. ఇద్దరి అరెస్ట్.. మరొకరు పరార్

image

ADBలోని ఠాకూర్ హోటల్ సమీపంలో మిర్జానసీర్ బైగ్ చెందిన లారీలో నుంచి ఆదివారం రాత్రి బ్యాటరీలు చోరీ చేసిన మరో దొంగను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ రావు తెలిపారు. ఈ కేసులో మంగళవారం వడ్డెర కాలనీకి చెందిన సంతోశ్‌ను రిమాండ్‌కు తరలించామన్నారు. తాజాగా మరో దొంగ కార్తిక్ అలియాస్ గణేశ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. మరో దొంగ మైనర్ అని.. అతని కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

News April 11, 2025

ADB: మట్కా నిర్వహిస్తున్న మహిళ.. నలుగురిపై కేసు:CI

image

ఆదిలాబాద్ ఖుర్షిద్ నగర్ లో మట్కా స్థావరం నిర్వహిస్తున్న వారిపై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ రావు వివరాల ప్రకారం.. షేక్ నజ్జు అనే మహిళ కాలనీలో మట్కా నిర్వహిస్తుండగా.. హుస్సేన్, సాహిల్‌లు మట్కా ఆడటానికి రాగా వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మట్కా డబ్బులను షేక్ నజ్జు మరో నిర్వాహకుడు నజీమ్ ఉద్దీన్ అలియాస్ బబ్లుకు జమ చేస్తుందన్నారు. దీంతో బబ్లుపై సైతం కేసు చేశారు.

News April 11, 2025

ADB: భారీగా అక్రమ మద్యం స్వాధీనం.. ఐదుగురిపై కేసు

image

బోథ్ మండలంలోని కౌట(B), ధన్నూర్(B) గ్రామాల్లో దాడులు నిర్వహించగా అక్రమ మద్యం పట్టుబడిందని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. కౌట గ్రామంలోని బెల్ట్ షాపులో రూ.90,000 వేల విలువైన 690 మద్యం బాటిళ్లు, ధన్నూర్‌లో రూ.1,34,000 విలువైన 587మద్యం బాటిల్లు దొరికాయన్నారు. బెల్ట్ షాపు నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్, రత్నపురం సాయన్న, VDCకి చెందిన వ్యక్తులు శ్రీకాంత్, రాజేశ్వర్ రెడ్డి, భూమారెడ్డిలపై కేసులు నమోదు చేశామన్నారు.

error: Content is protected !!