News May 28, 2024

రాజమౌళి-మహేశ్ సినిమాలో ‘ఆదిపురుష్’ హనుమంతుడు?

image

రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో రాబోతున్న సినిమాలో బాలీవుడ్ నటుడు దేవదత్త నాగే నటించనున్నట్లు సమాచారం. ఆయన రాజమౌళితో దిగిన ఓ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో ఈ వార్తకు బలం చేకూరింది. దేవదత్త నాగే ‘ఆదిపురుష్’ సినిమాలో హనుమంతుని పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగింది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

Similar News

News January 18, 2025

జేసీ ప్రభాకర్ రెడ్డిపై MAAకు నటి ఫిర్యాదు

image

టీడీపీ నేత <<15051797>>జేసీ ప్రభాకర్ రెడ్డిపై<<>> ఫిల్మ్ ఛాంబర్, MAAకు నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. ఆయన తన పట్ల దారుణంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. జేసీ ప్రభాకర్ క్షమాపణ చెబితే సరిపోదని, ఆయనపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందించకపోవడంతోనే ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేశానన్నారు.

News January 18, 2025

అన్నయ్యా.. మీ మాటలు భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి: తమన్

image

చిరంజీవి <<15185812>>ప్రశంసలపై<<>> తమన్ స్పందించారు. ‘డియర్ అన్నయ్యా.. మీ మాటలు నాకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీత శ్లోకాన్ని గుర్తుచేశాయి. ఎంత కాదనుకున్నా మనుషులం కదా.. ఒక్కోసారి ఆవేదన గుండె తలుపులు దాటి వచ్చేస్తూ ఉంటుంది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని, కళ్లు తెరిచే లోపలే చిదిమేస్తుంటే వచ్చిన బాధ అది. అర్థం చేసుకుని మీరు చెప్పిన మాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి’ అని ట్వీట్ చేశారు.

News January 18, 2025

CBIపై బాధితురాలి తండ్రి ఆరోపణలు

image

కోల్‌కతా హత్యాచార ఘటనపై CBI దర్యాప్తు పూర్తిగా చేయలేదని బాధితురాలి తండ్రి ఆరోపించారు. ఇందులో ఆరుగురు (నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు) ఉన్నట్లు DNA రిపోర్టులో వెల్లడైతే సంజయ్‌ను మాత్రమే నిందితుడిగా చేర్చారని చెప్పారు. తమ కూతురి గొంతుపై గాయాలున్నా ఆ శాంపిల్ సేకరించలేదన్నారు. అటు కేసు పురోగతిని ఎంత అడిగినా చెప్పలేదన్నారు. నేడు కోర్టుకు తమను పిలవలేదని, తమ లాయర్‌నూ రావద్దని కోరినట్లు తెలిపారు.