News March 18, 2025
ఏప్రిల్ 11న ‘ఆదిత్య 369’ రీరిలీజ్!

సోషియో ఫాంటసీ చిత్రం ‘ఆదిత్య 369’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్గా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనను మరోసారి థియేటర్లలో ఎక్స్పీరియెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?
Similar News
News March 18, 2025
VKB: 21 నుంచి ఏప్రిల్ 3 వరకు పది పరీక్షలు: కలెక్టర్

జిల్లాలో 12,903 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో డీఈఓ రేణుక దేవితో కలిసి పదో తరగతి పరీక్షలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 12,903 మంది విద్యార్థులకు గాను బాలురు 6,450 బాలికలు 6,453 ఉన్నారు.
News March 18, 2025
ప్రభుత్వ సంస్థల విద్యుత్ సర్ఛార్జీ రద్దు

AP: ప్రభుత్వ సంస్థలు, విభాగాల విద్యుత్ సర్ఛార్జీని మాఫీ చేస్తూ APERC ఉత్తర్వులు ఇచ్చింది. 2024-25కు గాను ఆయా సంస్థలు రూ.3,176 కోట్లు బకాయిపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో వన్ టైమ్ సెటిల్మెంట్ కింద సర్ఛార్జీని ఈఆర్సీ ఉపసంహరించుకుంది.
News March 18, 2025
అంతరిక్షంలో ఇలానే పడుకుంటారు!

వ్యోమగాములు సునీతా, విల్మోర్ ISS నుంచి 9 నెలల తర్వాత భూమి మీదకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతరిక్షంలో వారు ఎలా నిద్రపోయారనే సందేహం చాలా మందిలో నెలకొంది. దీనికోసం అక్కడ చేసిన ఏర్పాట్లను NASA తెలియజేసింది. అక్కడ వ్యోమగాములు స్లీపింగ్ బ్యాగుల్లో తమ శరీరాలను ఉంచి నిద్రిస్తారు. వారికి దగ్గర్లోనే కంప్యూటర్ హెడ్ఫోన్, ల్యాప్టాప్, వ్యక్తిగత వస్తువులు ఉంచుకునేలా ఏర్పాటు చేశారు.