News November 18, 2024
పట్నం బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
TG: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో A1గా ఉన్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను కొడంగల్ కోర్టు వాయిదా వేసింది. ఈ నెల 25న విచారిస్తామని తెలిపింది. అటు అతడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ చేపట్టనుంది.
Similar News
News November 18, 2024
మరో 500 SBI బ్రాంచీలు: నిర్మల
FY25 చివరికి మరో 500 SBI బ్రాంచీలను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఆ సంఖ్య 23,000లకు చేరుకుంటుందని తెలిపారు. దేశంలో SBIకి 50crకు పైగా కస్టమర్లు ఉన్నారని, మొత్తం డిపాజిట్లలో 22.4% వాటా ఉందని చెప్పారు. రోజుకు 20cr UPI లావాదేవీలను నిర్వహిస్తోందన్నారు. ముంబైలోని SBI ప్రధాన కార్యాలయం వందో వార్షికోత్సవం సందర్భంగా రూ.100 స్మారక నాణెంను ఆమె ఆవిష్కరించారు.
News November 18, 2024
గుడ్న్యూస్: టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని విద్యాశాఖ మరోసారి <
News November 18, 2024
అరెస్టులకు భయపడేవారు లేరిక్కడ: KTR
TG: రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. ‘నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగమిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీప్ను అరెస్ట్ చేశారు. విచారణకు రమ్మని పిలిచి అక్రమంగా అరెస్ట్ చేస్తారా? ఎన్నాళ్లు ఈ అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తావు. నీ అక్రమ అరెస్టులకు భయపడేవాడు ఎవరూ లేరిక్కడ’ అని KTR ట్వీట్ చేశారు.