News November 26, 2024
RGV ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను AP హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. పోలీసులు ఇప్పటికే రెండుసార్లు నోటీసులిచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు ఎస్పీ ప్రత్యేక బృందాలను పంపారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్‌ను కించపరిచేలా పోస్టులు పెట్టారని RGVపై మద్దిపాడు PSలో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
Similar News
News January 28, 2026
80 గంటల్లో రెండు సార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణం

మహారాష్ట్ర రాజకీయాల్లో 2019 నవంబరులో ఏర్పాటైన ’80 గంటల ప్రభుత్వం’ అజిత్ పవార్‌కు రాజకీయాలలో కీలక ఘట్టం. నాటకీయ పరిణామాల నడుమ అర్ధరాత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి Dy.CMగా పవార్ ప్రమాణం చేశారు. అయితే సంఖ్యాబలం లేకపోవడంతో 80 Hrsలోనే ప్రభుత్వం కూలిపోయింది. వెంటనే ఆయన తిరిగి NCPకి వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మరోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
News January 28, 2026
ఈయూతో డీల్.. భారత్ సాధించిన గొప్ప విజయం: US ట్రేడ్ ప్రతినిధి

ఇండియా-EU మధ్య కుదిరిన <<18973407>>ఒప్పందం<<>>పై US ట్రేడ్ ప్రతినిధి జెమీసన్ గ్రీర్ ప్రశంసలు కురిపించారు. ‘డీల్‌లోని కొన్ని అంశాలు చదివాను. ఇండియాకు అనుకూలంగా కనిపిస్తోంది. యురోపియన్ మార్కెట్లో విస్తృత అవకాశాలు దక్కుతాయి. డీల్ అమల్లోకి వచ్చాక ఆ దేశానికి గొప్ప విజయంగా నిలవబోతోంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత వర్కర్లు యూరప్‌కు వెళ్లేందుకు అవకాశాలు దక్కుతాయని తెలిపారు.
News January 28, 2026
వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తున్నాం: ముర్ము

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తున్నారు. దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. గత పదేళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, 10 కోట్ల మందికి LPG కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు.


