News May 31, 2024
ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం వాయిదా
TG: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, ఓట్ల లెక్కింపు కారణంగా ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ మూల్యాంకనాన్ని వాయిదా వేసినట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి జరగాల్సిన ఈ ప్రక్రియను జూన్ 5 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. 5వ తేదీ నుంచి తొలి విడత, 7వ తేదీ నుంచి రెండో విడత ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో జూనియర్ కాలేజీలకు నేటితో వేసవి సెలవులు ముగియనున్నాయి.
Similar News
News January 20, 2025
‘అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది’
AP: విజయనగరం(D) నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థి సాయి మణిదీప్(24) ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఫ్యామిలీకి అతడు రాసిన లేఖ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డాడీ, అమ్మ, తమ్ముడు నన్ను క్షమించండి. కష్టపడి చదువుదామంటే నాతో కావడంలేదు. బతకాలంటే భయమేస్తోంది. 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు’ అని రాసిన లేఖ వైరలవుతోంది.
News January 20, 2025
బంగాళదుంపలు రోజూ తింటున్నారా?
బంగాళదుంపలను ఆహారంలో రోజు కాకుండా వారానికి రెండు, మూడు రోజులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి వేడి స్వభావం ఉండటం వల్ల వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారు తినడం తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిని నూనెలో వేయించి తినడం కంటే ఉడకబెట్టుకొని తినడం మేలు అని చెబుతున్నారు.
News January 20, 2025
కొత్త ఫోన్‌తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా
బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి కొరియర్‌లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్‌లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్‌ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.