News October 22, 2024
మహారాష్ట్రలో విపక్ష కూటమి మధ్య సీట్ల సర్దుబాటు?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం మేరకు 288 స్థానాల్లో కాంగ్రెస్ 105-110 స్థానాల్లో, శివసేన UBT 90-95 స్థానాల్లో, NCP SP 75-80 స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపనున్నాయి. కాంగ్రెస్-ఉద్ధవ్ మధ్య లుకలుకలు నడుస్తున్నాయన్న వార్తల మధ్య సీట్ల సర్దుబాటు కుదరడం గమనార్హం.
Similar News
News December 6, 2025
NTR జిల్లాలో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు

NTR జిల్లాలో 2 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జ్వరంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన జి.కొండూరుకు చెందిన రెండున్నరేళ్ల బాలుడు పాత ప్రభుత్వాసుపత్రి పిల్లల విభాగంలో, కంచికచర్లకు చెందిన 45 ఏళ్ల మహిళ కొత్త ప్రభుత్వాసుపత్రి జనరల్ మెడిసిన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, అవసరమైన చికిత్స అందుతున్నట్లు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు తెలిపారు.
News December 6, 2025
INDvsSA.. ఇద్దరు ప్లేయర్లు దూరం!

భారత్‌తో మూడో వన్డేకు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ బర్గర్, బ్యాటర్ టోనీ డి జోర్జి గాయాల కారణంగా దూరమయ్యారు. జోర్జి T20 సిరీస్‌కూ దూరమైనట్లు SA బోర్డు వెల్లడించింది. టీ20లకు ఎంపికైన పేసర్ మఫాకా ఇంకా కోలుకోలేదని, అతడి స్థానంలో సిపమ్లాను ఎంపిక చేసినట్లు తెలిపింది. కాగా తొలి వన్డేలో 39 రన్స్ చేసిన జోర్జి, రెండో వన్డేలో 17పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. బర్గర్ 2 మ్యాచుల్లో 3 వికెట్లు తీశారు.
News December 6, 2025
ధనికులకు దండాలు.. పేదలకు దండనా?.. రైల్వే తీరుపై విమర్శలు

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక <<18483830>>రైళ్లను<<>>, 37 రైళ్లకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొస్తున్నాయి. ‘సామాన్యుల రద్దీతో జనరల్ బోగీలు నిండిపోయి ఇబ్బంది పడుతున్నా మా కోసం ఎప్పుడైనా అదనపు బోగీలు వేశారా? ధనవంతులకి ఒక న్యాయం, పేదవాడికి మరో న్యాయమా?’ అని మండిపడుతున్నారు. పండుగల సమయాల్లోనైనా బోగీలు పెంచాలంటున్నారు.


