News July 30, 2024
వచ్చే నెల 14 నుంచి వైద్య కళాశాలల ప్రవేశ ప్రక్రియ

TG: వైద్యవిద్య కోర్సుల్లో(ఎంబీబీఎస్, యునాని, హోమియో, ఆయుర్వేదం) ప్రవేశానికి వచ్చే నెల 14 నుంచి కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈమేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(MCC) నిర్ణయించింది. వచ్చే నెల మొదటివారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఆ సమాచారం కోసం ఎంసీసీ వెబ్సైట్ను పరిశీలించాలని అధికారులు తెలిపారు. జాతీయస్థాయి కోటాలోని 15శాతం సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ జరగనుంది.
Similar News
News April 2, 2026
రూపీ సూపర్ రికవరీ

ఇటీవల ఒక డాలరుకు ₹95.12కు చేరి ఆల్ టైమ్ <<19515449>>కనిష్ఠాన్ని<<>> నమోదు చేసిన రూపాయి విలువ క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా 24 గంటల వ్యవధిలో భారీ రికవరీ నమోదు చేసింది. ఒక డాలరుకు 93.48గా ఉన్న రూపాయి విలువ ఏకంగా 88 పైసలు పెరిగి 92.60కు చేరింది. యుద్ధం ఆగే సూచనలు, మార్కెట్లు నిన్న సానుకూలంగా ఉండటం రూపాయి రికవరీకి కలిసొచ్చింది.
News April 2, 2026
స్టార్ క్యాంపెయినర్లుగా సీఎం, డిప్యూటీ సీఎం బిజీబిజీ

TG: ఈనెల 9న పుదుచ్చేరి, కేరళం, అస్సాం రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా బిజీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేరళంలో పర్యటిస్తుండగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజు, రేపు పుదుచ్చేరిలో పర్యటిస్తారు. ఆ తర్వాత ఈనెల 4న కేరళంలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు సైతం కేరళంలో ప్రచారంలో పాల్గొన్నారు. <<-se>>#Elections2026<<>>
News April 2, 2026
కరెంట్ అఫైర్స్

* డీజీసీఏ చీఫ్గా వీర్ విక్రమ్ యాదవ్ నియామకం
* AP: అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభలో ఆమోదం
* ‘పారాక్వాట్’ గడ్డిమందుపై తెలంగాణ తాత్కాలిక నిషేధం
* భారత్ తొలి డిజిటల్ సెన్సస్ ప్రారంభం
* గుజరాత్లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి సంశోధక్ సర్వే నౌక
* భారత్ వేదికగా మే నెలలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సు


