News March 24, 2025
APR 7 నుంచి అడ్మిషన్లు.. వేసవి సెలవుల్లో మార్పు!

AP: ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది APR 1న మొదలుకానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఆపై మే నెలాఖరు వరకు సెలవులుండగా, జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 హాలిడేస్ ఉంటాయి.
Similar News
News October 14, 2025
మల్లోజుల వేణుగోపాల్ నేపథ్యమిదే!

<<18001632>>మల్లోజుల వేణుగోపాల్<<>> అలియాస్ సోనూ దివంగత మావోయిస్టు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ తమ్ముడు. ఇతని స్వస్థలం TGలోని పెద్దపల్లి. బీకాం చదివిన ఈయన గడ్చిరోలి, ఏపీ, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2011 NOVలో బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ చనిపోగా, ఆ తర్వాత వేణుగోపాల్ భార్య తార లొంగిపోయారు. 69ఏళ్ల వయసున్న వేణుగోపాల్ మునుపటిలా యాక్టివ్గా లేరని సమాచారం.
News October 14, 2025
కొనుగోళ్లలో పత్తి రైతుకు దక్కని మద్దతు

AP: కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్లో పత్తికి గిట్టుబాటు ధర దక్కడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి మద్దతు ధర క్వింటాల్కు పొడవు పింజ రూ.8,110, పొట్టి పింజ రూ.7,710గా నిర్ణయించారు. అయితే సోమవారం 16 వేల క్వింటాళ్ల మేర పత్తి అమ్మకానికి రాగా.. క్వింటాకు గరిష్ఠంగా రూ.7,419, కనిష్ఠంగా రూ.3,966కే కొన్నారు. మెజార్టీ పత్తిని క్వింటాకు రూ.5,500-రూ.5000 మధ్యే కొంటున్నారని రైతులు చెబుతున్నారు.
News October 14, 2025
భారత తొలి IFS అధికారిణి గురించి తెలుసా?

మధ్యతరగతి మహిళ గడప దాటడమే కష్టమైన రోజుల్లో ధైర్యంగా బడికెళ్లి చదువుకున్నారు IFS అధికారిణి ముత్తమ్మ. ‘ఇది మహిళల సర్వీస్ కాదు’ అన్న UPSC ఛైర్మన్ లింగ వివక్షనూ ఎదుర్కొన్నారామె. వివాహిత మహిళల సర్వీసు హక్కు కోసం సుప్రీంలో పోరాడారు. 1949లో తొలి IFS అధికారిణిగా నియమితులై చరిత్ర సృష్టించారు. మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచిన ముత్తమ్మ 2009లో చనిపోయారు. * ఉమెన్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.