News August 9, 2025
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో అడ్మిషన్లు.. ఈనెల 13 వరకే ఛాన్స్

TG: Dr.B.R.అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో B.A, B.Com, B.Sc, M.A, M.Com, MSc, డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లకు గడువు ఈనెల 13తో ముగియనుంది. ఇంటర్/ITI, ఓపెన్ ఇంటర్, పాలిటెక్నిక్ పాసైన వారు అర్హులు. <
Similar News
News August 9, 2025
ట్రంప్, పుతిన్ భేటీకి డేట్ ఫిక్స్

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో వచ్చే శుక్రవారం (ఆగస్టు 15న) సమావేశం కానున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఈ భేటీ అలస్కాలో జరగనుందని వెల్లడించారు. అంతకుముందు ట్రంప్ సమక్షంలో ఆర్మేనియా, అజర్‌బైజాన్ దేశాధినేతలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా సీజ్ ఫైర్ ఒప్పందం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News August 9, 2025
‘WAR-2’లో షారుఖ్, సల్మాన్?

‘WAR-2’ సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్, శార్వరి కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ‘స్పై యూనివర్స్’లో భాగంగా యశ్ రాజ్ ఫిల్మ్స్ గతంలో షారుఖ్, సల్మాన్ హీరోలుగా సినిమాలు నిర్మించింది. ‘WAR2’ కూడా అదే యూనివర్స్ నుంచి వస్తుండగా.. ఆలియా, శార్వరిలతో ‘ఆల్ఫా’ అనే మూవీ తెరకెక్కనుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌లో వీరందరిని ఒకే మూవీలో చూపించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
News August 9, 2025
HDFC కస్టమర్లకు గుడ్‌న్యూస్

HDFC బ్యాంక్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(MCLR)ను 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇది రుణ కాలపరిమితిని బట్టి 8.55%-8.75% మధ్య ఉండనుంది. ఓవర్ నైట్/ఒక నెల MCLR 8.60% నుంచి 8.55%కి, 3 నెలలకు 8.65% నుంచి 8.60%కి, 6 నెలలకు 8.75% నుంచి 8.70%కి, ఏడాది MCLR 9.05% నుంచి 8.75%కి తగ్గింది. ఈ తగ్గింపు ఈ నెల 7 నుంచి అమల్లోకి రాగా లోన్ల EMI చెల్లించే వారికి స్వల్ప ఊరట దక్కనుంది.