News March 28, 2024

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు.. ఏప్రిల్ 28న పరీక్ష

image

TG: బీసీ గురుకులాల పరిధిలో ఉన్న 255 జూనియర్ కాలేజీల్లో 2024-25 ప్రవేశాలకు ఏప్రిల్ 28న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొత్తం 21,920 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

Similar News

News October 19, 2025

16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: లోకేశ్

image

గత 16 నెలల్లో ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క APలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది’ అని AUSలో తెలుగు డయాస్పోరా సమావేశంలో తెలిపారు.

News October 19, 2025

దీపారాధన సమయంలో చదవాల్సిన మంత్రం

image

దీపోజ్యోతిః పరం బ్రహ్మ, దీపః సర్వతమో పహః |
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే ॥
దైవస్వరూపమైన జ్యోతి అజ్ఞానమనే చీకటిని పారద్రోలి, జ్ఞానమనే వెలుగునిస్తుంది. అందుకే దీపాన్ని దీపలక్ష్మిగా పూజిస్తూ ‘సంధ్యా దీపమా! నీకు నమస్కారం’ అని అంటాం. ఎవరి ఇంట అయితే దీపాలెప్పుడూ వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులు. వారి కార్యాలన్నీ సుగమం అవుతాయి.
* రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 19, 2025

బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్

image

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారిద్దరూ ఇన్‌స్టా పోస్టు ద్వారా తెలియజేశారు. ‘చివరకు మా బేబీ బాయ్ వచ్చేశాడు. మా హృదయాలు నిండిపోయాయి. ఇప్పుడు మాకు అన్నీ ఉన్నాయి. కృతజ్ఞతలతో పరిణీతి, రాఘవ్’ అని రాసుకొచ్చారు. 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.