News April 11, 2024

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు.. గడువు పెంపు

image

TG: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో, 261 బీసీ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. విద్యార్థులు ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల సెట్ కన్వీనర్ బి.సైదులు తెలిపారు. ఈనెల 28న ప్రవేశ పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలోని 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈనెల 20 వరకు పొడిగించారు.

Similar News

News October 20, 2025

పురుగుల బెడద తగ్గించే లింగాకర్షక బుట్టలు

image

లింగాకర్షక బుట్టల్లో ఉండే ‘ల్యూర్’ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండుఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్‌లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.

News October 20, 2025

మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లు

image

అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. దీనికోసం ఇంట్లోనే ఉండే కొన్నిపదార్థాలతో ఈ ప్యాక్స్ ట్రై చేసి చూడండి. * పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలు ఉంచి మెల్లగా మసాజ్ చేస్తూ కడిగేయాలి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది. * పసుపు, గంధం, పాలు, రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ వారానికి రెండుసార్లు వేస్తే ముఖం అందంగా మెరిసిపోతుంది.

News October 20, 2025

కరుడుగట్టిన నేరస్థుడు రియాజ్.. కథ ముగిసింది

image

TG: నిజామాబాద్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన రియాజ్ బుల్లెట్ బైకులను చోరీ చేయడంలో దిట్ట అని పోలీసులు వెల్లడించారు. ఇతడిపై 60కి పైగా కేసులున్నాయి. శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ ఇతడిని పట్టుకుని బైకుపై తీసుకెళ్తుండగా కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. నిన్న పోలీసులు అతడిని పట్టుకున్నారు. ఆ క్రమంలో గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఇవాళ గన్ తీసుకుని పారిపోతుండగా పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.