News March 22, 2024

కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభం

image

AP: రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆరో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరేందుకు ప్రవేశ ప్రక్రియ నిర్వహించనున్నారు. 7, 8, 9 తరగతుల్లో చేరేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్ట్ రూపొందించనున్నారు. ఎంపికైన వారికి ఫోన్ ద్వారా సమాచారమిస్తారు. apkgbv.apcfss.in వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 11లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News November 25, 2024

సెన్సెక్స్‌, నిఫ్టీలో అక్క‌డ Strong Resistance

image

స్టాక్ మార్కెట్లు సోమ‌వారం భారీ లాభాలను ఆర్జించినా Day Highని అధిగమించలేదు. సెన్సెక్స్‌లో 80,470 వ‌ద్ద‌, నిఫ్టీలో 24,350 వ‌ద్ద ఉన్న Strong Resistance వ‌ల్ల సూచీలు Consolidation Zoneలోనే ప‌య‌నించాయి. ఉద‌యం 2 సూచీల్లో Pre-Open Marketలో భారీగా బిజినెస్ జరిగింది. ఆ లాభాలు మిన‌హా ఈరోజు ప్ర‌త్యేకించి సూచీలు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. ఉదయం ట్రేడింగ్ Open అయిన స్థాయిలోనే చివరికి Close అయ్యాయి.

News November 25, 2024

ఉమ్రాన్ మాలిక్ అన్‌సోల్డ్

image

SRH స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు IPL వేలంలో నిరాశ ఎదురైంది. అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. మరో పేసర్ జయదేవ్ ఉనద్క‌త్‌ను SRH రూ.కోటి చెల్లించి సొంతం చేసుకుంది. ఇషాంత్ శర్మను గుజరాత్ రూ.75లక్షలకు, నువాన్ తుషారాను బెంగళూరు రూ.1.6 కోట్లకు కొన్నాయి. ఇక ఉమేశ్ యాదవ్, నవీన్ ఉల్ హక్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్ అయ్యారు.

News November 25, 2024

సీజ్‌ఫైర్‌కు అంగీక‌రించిన ఇజ్రాయెల్‌!

image

లెబ‌నాన్‌లో తాత్కాలికంగా కాల్పుల విర‌మ‌ణ‌కు ఇజ్రాయెల్‌ అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో 2 రోజుల్లో దీనిపై ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. ఈ ఒప్పందం మేర‌కు హెజ్బొల్లా త‌న బ‌ల‌గాల‌ను లిటాని న‌దికి ఉత్త‌రంగా త‌రలించాలి. ద‌క్షిణ లెబ‌నాన్ నుంచి ఇజ్రాయెల్ ద‌ళాలను ఉప‌సంహ‌రించుకోవాలి. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల విభజనపై ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య చర్చలు జ‌రుగుతాయి. ఈ ఒప్పందం అమ‌లును అమెరికా ప‌ర్య‌వేక్షిస్తుంది.