News September 10, 2025

అగ్రికల్చర్ వర్సిటీలో PG, PhDలో ప్రవేశాలు

image

<>ఆచార్య<<>> NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ PG, PhDలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 18వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో SEP 22వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్&టెక్నాలజీ విభాగంలో ఉన్నాయి. వెబ్‌సైట్:https://angrau.ac.in/

Similar News

News April 8, 2026

హార్ముజ్‌పై టోల్స్ విధిస్తే ఒప్పుకోం: ఒమన్

image

హార్ముజ్ జలసంధిపై టోల్స్ విధించేందుకు అనుమతించాలన్న ఇరాన్ సీజ్‌ఫైర్ డిమాండ్‌ను పొరుగు దేశమైన ఒమన్ తప్పుపట్టింది. అది అంతర్జాతీయ జలమార్గమని దానిపై ఫీజు వసూలు చేయడం సరికాదని ఒమన్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ పేర్కొన్నారు. దీనిపై గతంలో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు తెలిపారు. కాగా అంతకుముందు హార్ముజ్‌పై టోల్స్‌కు ఇరాన్, ఒమన్ అంగీకరించాయని ఇరాన్ మీడియా పేర్కొంది.

News April 8, 2026

సీజ్‌ఫైర్ వేళ.. UAE, కువైట్‌పై ఇరాన్ దాడి

image

తమ దేశంలోని లవన్ రిఫైనరీపై దాడికి ప్రతీకారంగా UAE, కువైట్‌పై ఇరాన్ విరుచుకుపడింది. మిడిల్ ఈస్ట్‌లోని ఆ రెండు దేశాలపై మిస్సైల్స్‌ ప్రయోగించింది. ఒకవైపు సీజ్‌ఫైర్ అమల్లో ఉండగానే తమపై దాడి జరిగిందని ఇరాన్ చెప్తోంది. అందుకే అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాలపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

News April 8, 2026

ట్రంప్‌ను ఇరాన్ ఫూల్ చేసిందా?

image

సీజ్‌ఫైర్‌పై ఇరాన్ ప్రతిపాదించిన పది పాయింట్ల డాక్యుమెంట్‌ పార్సీ, ఇంగ్లిష్ వెర్షన్‌లలో తేడాలు ఉండటం చర్చనీయాంశమైంది. పార్సీ వెర్షన్‌లో యురేనియంపై హక్కును గుర్తించాలనే డిమాండ్ ఉండగా ఇంగ్లిష్ వెర్షన్‌లో అది మిస్ అయినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. దీంతో ట్రంప్‌ను ఇరాన్ బురిడి కొట్టించిందనే టాక్ నడుస్తోంది. కాగా అణ్వాయుధాల తయారీకి యురేనియం ఎంతో కీలకం.