News April 27, 2024
అంధులు, బధిరుల విద్యాలయాల్లో అడ్మిషన్లు

AP: ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఒకటో క్లాసు నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తోంది. విజయనగరం, విశాఖ, హిందూపురం, ఒంగోలు, బాపట్లలోని బధిరుల ఆశ్రమ పాఠశాలలు, కాలేజీలో 491 సీట్ల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఐదేళ్ల వయసు పైబడిన వారు ఆధార్, సదరం సర్టిఫికెట్, 3 పాస్పోర్టు సైజు ఫొటోలు తీసుకుని ఆయా విద్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు పైన ఫొటోలో చూడొచ్చు.
Similar News
News November 18, 2025
BREAKING: భారీ అగ్ని ప్రమాదం

TG: మహబూబ్నగర్లోని గొల్లపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సలార్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో మంటలు చెలరేగి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

వాహన ఫిట్నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

వాహనాల ఫిట్నెస్ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.