News May 27, 2024

టీటీడీ కాలేజీల్లో అడ్మిషన్లు.. దరఖాస్తుకు 4 రోజులే ఛాన్స్

image

AP: 2024-25 విద్యా సంవత్సరానికి టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు <>దరఖాస్తు<<>> ప్రక్రియ ఈనెల 31తో ముగియనుంది. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కాలేజీలో బాలికలకు 968 సీట్లు, శ్రీ వెంకటేశ్వర కాలేజీలో బాలురకు 792 సీట్లు అందుబాటులో ఉన్నాయి. టెన్త్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం అందిస్తారు.

Similar News

News December 5, 2025

ఏపీలో తొలి సోలార్ వేఫర్ యూనిట్: నారా లోకేశ్

image

AP: దేశంలోనే తొలి సోలార్ ఇంగోట్ వేఫర్ తయారీ యూనిట్ ఏపీలో ఏర్పాటవుతున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇది రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. అనకాపల్లిలో ReNewCorp రూ.3,990 కోట్ల పెట్టుబడితో 6GW సామర్థ్యంతో ఈ యూనిట్‌ను స్థాపించనున్నట్లు ‘X’ వేదికగా వెల్లడించారు. CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో కుదిరిన MoU ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని పేర్కొన్నారు.

News December 5, 2025

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో హెడ్ SeMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech/BCA/BSc(IT)/BSc(CS), M.Tech/MS/MBA/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://ora.digitalindiacorporation.in

News December 5, 2025

ప్రయాణికులకు చుక్కలు.. మరో 600 విమానాల రద్దు

image

ప్రయాణికులకు IndiGo చుక్కలు చూపిస్తోంది. ఇవాళ మరో 600 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో ఢిల్లీలో 235, హైదరాబాద్, బెంగళూరు, ముంబైలో 100 చొప్పున ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి వరకు ఢిల్లీకి వచ్చే/వెళ్లే ఇండిగో సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, నీటికి అవస్థలు పడుతున్నామని, రాత్రి నేలపై పడుకున్నామని వాపోతున్నారు.