News April 5, 2025
ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే బీసీ గురుకులాల్లో ప్రవేశాలు

TG: మహాత్మా జ్యోతిబాఫూలే BC గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ సీట్లను ఎంట్రన్స్ టెస్ట్ లేకుండానే భర్తీ చేయాలని సొసైటీ నిర్ణయించింది. ఏటా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుండగా, ఆ విధానాన్ని రద్దు చేసింది. టెన్త్లో వచ్చిన మార్కులు, మెరిట్ ఆధారంగా ఇంటర్లో, ఇంటర్ మార్కులు, మెరిట్ ఆధారంగా డిగ్రీలో అడ్మిషన్లు కల్పిస్తారు. BC గురుకులాల సొసైటీ పరిధిలోని 261 ఇంటర్, 33 డిగ్రీ కాలేజీల్లో కలిపి మొత్తం 25వేల సీట్లున్నాయి.
Similar News
News November 22, 2025
IIT హైదరాబాద్లో స్టాఫ్ నర్స్ పోస్టులు

<
News November 22, 2025
కివీతో ఎన్నో లాభాలు

కొంచెం పుల్లగా, తీపిగా ఉండే కివీతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి, చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, బరువును తగ్గించడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇందులోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడతాయని చెబుతున్నారు.
News November 22, 2025
మహిళలకు ₹లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు: భట్టి

TG: మహిళలకు ఏటా వడ్డీలేని రుణాల కింద ₹20వేల కోట్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని Dy CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటి వరకు ₹27వేల CR అందించామని, 5 ఏళ్లలో ₹లక్ష CR ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.15 CR కుటుంబాలుంటే అందులో కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు ఇస్తున్నామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, సన్నబియ్యం వంటి పథకాలతో పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు.


