News March 29, 2025
గురుకులాల్లో ప్రవేశాలు.. దరఖాస్తు గడువు పెంపు

AP: గురుకుల స్కూళ్లలో ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగిలిన ఖాళీల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 6లోగా https://aprs.apcfss.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్ సీట్ల భర్తీకి నిర్వహించే పరీక్షకు కూడా ఏప్రిల్ 6 వరకు అప్లై చేసుకోవచ్చని సూచించారు.
Similar News
News March 31, 2025
IPL: టాస్ గెలిచిన ముంబై

వాంఖడే స్టేడియంలో కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నారు. MI తరఫున అశ్వనీ కుమార్ అరంగేట్రం చేస్తున్నారు.
MI: రికెల్టన్, జాక్స్, సూర్య, తిలక్, హార్దిక్, నమన్ ధిర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేశ్
KKR: డీకాక్, అయ్యర్, రహానే, రింకూ, రఘువంశీ, నరైన్, రస్సెల్, రమన్దీప్, జాన్సన్, రాణా, వరుణ్ చక్రవర్తి
News March 31, 2025
బుల్లెట్ ప్రూఫ్ బాల్కనీ నుంచి సల్మాన్ ఈద్ విషెస్

రంజాన్ సందర్భంగా అభిమానులకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముంబైలోని తన ‘గెలాక్సీ’ హౌస్ బాల్కనీకి వచ్చి అభివాదం చేశారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఉండటంతో సల్మాన్ బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ను అమర్చారు. ఆయన అందులో నుంచే తన సోదరి అర్పిత ఖాన్ పిల్లలు ఆయత్, ఆహిల్తో ఫ్యాన్స్కు కనిపించి విషెస్ చెప్పారు.
News March 31, 2025
రేపటి నుంచి కొత్త రూల్స్

✒ స్టాండర్డ్ డిడక్షన్ ₹75Kతో కలుపుకుని ₹12.75L వరకు పన్ను మినహాయింపు.
✒ బ్యాంకుల్లో డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు జమయ్యే వడ్డీ ₹లక్ష వరకు, 60ఏళ్లలోపు వ్యక్తులకు ₹50K వరకు నో TDS.
✒ ఇన్యాక్టివ్/వేరే వారికి కేటాయించిన మొబైల్ నంబర్లకు UPI సేవలు రద్దు.
✒ UPI లైట్ వ్యాలెట్లో డిపాజిట్ చేసిన నగదును బ్యాంక్ అకౌంట్కు పంపుకోవచ్చు.
✒ NPS వాత్సల్యలో పెట్టుబడులకు సెక్షన్ 80CCD(1B)కింద పన్ను మినహాయింపు.