News September 11, 2025

ఇంటర్‌లో ప్రవేశాలు.. రెండు రోజులే ఛాన్స్

image

TG: ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు బోర్డు మరో అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు ఆన్‌లైన్ <>పోర్టల్<<>> ఓపెన్ చేస్తామని బోర్డు అధికారులు ప్రకటించారు. ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ కోసం రూ.500 ఫైన్ చెల్లించాలని, ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలకు అవసరం లేదని తెలిపారు. స్టూడెంట్స్ ఇప్పటికే సమర్పించిన వివరాల్లో తప్పులనూ సవరించుకోవచ్చన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన కాలేజీల్లోనే అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.

Similar News

News September 11, 2025

కుల్దీప్ అదరగొట్టాడు.. కానీ నెక్స్ట్ మ్యాచులో ఉండడు: మంజ్రేకర్

image

UAEతో <<17672914>>మ్యాచులో<<>> 4 వికెట్లతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్‌ను తదుపరి మ్యాచులో పక్కన పెడతారని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఎప్పుడైతే అతడు అద్భుతంగా రాణిస్తాడో.. నెక్స్ట్ మ్యాచ్‌లో చోటు కోల్పోతాడు. నేను జస్ట్ జోక్ చేస్తున్నా. కానీ టీమ్ ఇండియాలో అతడి కెరీర్‌ను చూస్తే ఇదే అర్థమవుతోంది. సత్తా ఉన్న ఆటగాడికి ఇలా జరుగుతోంది. అంతా అతడి తలరాత’ అని వ్యాఖ్యానించారు.

News September 11, 2025

ఈ నెల 15న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

TG: రాష్ట్ర క్యాబినెట్ ఈనెల 15న సమావేశం కానుంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలపై చర్చించనుంది. ఓవైపు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండగా, మరోవైపు 42% BC రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

News September 11, 2025

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యత

image

AP: పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P-4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్) ప్రోగ్రామ్ బాధ్యతలను ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ప్రతి ఉద్యోగికి సగటున 3 క్లస్టర్‌లు కేటాయించింది. 1,08,311 మంది 2.14 లక్షల క్లస్టర్లలోని 21.56 లక్షల బంగారు కుటుంబాల బాధ్యతలను చూడాల్సి ఉంటుంది. మార్గదర్శులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూ బంగారు కుటుంబాలకు సాయం అందేలా చూడాలి.