News January 17, 2025
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. నేటి నుంచి దరఖాస్తులు!

TG: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆరో తరగతిలో (2025-26) ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 23 స్కూళ్లలో 1,380 సీట్లను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 16లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
వెబ్సైట్: <
Similar News
News October 24, 2025
బస్సు ప్రమాదంలో 13మంది తెలంగాణవాసులు!

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన చోటుకు గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, SP చేరుకున్నారు. ‘బస్సులో 13 మంది తెలంగాణవాసులు ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఏడుగురికి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో నలుగురు HYD, ఖమ్మం, RR, సంగారెడ్డికి చెందినవారిగా గుర్తించాం. మిగిలిన ఆరుగురు చనిపోయారా, బతికున్నారా? అనే విషయం తెలియాల్సి ఉంది’ అని అన్నారు. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.
News October 24, 2025
ప్రపంచబ్యాంకు నుంచి అమరావతికి మరో ₹1,750 కోట్లు!

AP: అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంకు రెండో విడతగా ₹1,750 కోట్లు ఇవ్వనుంది. డిసెంబర్ నాటికి ఈ ఫండ్స్ వచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ తెలిపారు. ‘తొలి విడతలో WB విడుదల చేసిన ₹1,800 కోట్లలో 50% ఖర్చు చేశాం. ఇందులో 75% పూర్తయ్యాక రెండో విడత కోసం దరఖాస్తు చేస్తాం’ అని చెప్పారు. అమరావతి ప్రాజెక్టులకు ₹13,600 కోట్ల ఆర్థిక సాయం చేస్తామని గతంలో వరల్డ్ బ్యాంక్, ADB ప్రకటించాయి.
News October 24, 2025
విగ్రహంలో దేవుడు ఉంటాడా?

భగవంతునికి చంచల, నిశ్చల అనే రెండు రూపాలున్నాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందులో చలనము లేని రూపమే విగ్రహం. ఈ రూపంలో కూడా పరమాత్మ నిత్యం కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే విగ్రహాన్ని రాతిగా చూడరాదని అంటుంటారు. భక్తుల కోసం, భక్తుల ఆరాధన కోసం భగవంతుడు తన లీల ద్వారా ఈ రూపంలో కొలువై ఉంటాడట. భక్తులచే పూజలందుకొని అనుగ్రహాన్ని కల్పిస్తాడట. విగ్రహంలో దేవుడు లేడన్న మాట అవివేకం. <<-se>>#WhoIsGod<<>>


