News December 21, 2024
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. షెడ్యూల్ విడుదల

TG: 194 మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ విడుదలైంది. 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నెల 23న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 2025 ఏప్రిల్ 13న ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. 6వ క్లాసులో అన్ని సీట్లకు, 7-10వ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే భర్తీ చేస్తారు. SC, ST, BC, దివ్యాంగులు, EWS విద్యార్థులు రూ.125, ఓసీలు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News January 5, 2026
ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్!

TG: గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి ఎన్నికల కోడ్ వల్ల ఆగిన ‘గృహలక్ష్మి’ పథకాన్ని ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు’లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. ‘ఇందిరమ్మ ఇళ్లు’ పథకం ప్రకటించగానే పలువురు నిర్మాణాలు మొదలుపెట్టారు. తుది జాబితాలో చోటు దక్కక కొందరు వదిలేశారు. అలా ఆగిపోయిన ‘గృహలక్ష్మి’ ఇళ్లు 13 వేల వరకు ఉండగా వాటికి నిధులు విడుదలయ్యే ఛాన్సుంది.
News January 5, 2026
కట్టకొక కంకి లేతైనా పుట్టికి ఏదుంతరుగు

పంట పండే సమయంలో ప్రతి మొక్కకు (కట్టకు) ఉండే కంకి గట్టిపడకుండా, పాలు పోసుకునే దశలో లేదా లేతగా ఉంటే, గింజ బరువు తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో పంటను అమ్మితే ఆశించిన బరువు రాకపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. అంటే పంట కేవలం సంఖ్యలో (కంకులు) ఎక్కువగా ఉంటే సరిపోదు, గింజ ముదిరి గట్టిగా ఉంటేనే రైతుకు సరైన బరువు, తద్వారా లాభం వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.
News January 5, 2026
మానస పూజకు నియమాలేంటి?

శివ మానస పూజకు ఏకాగ్రతే ప్రధానమైన నియమం. అంతకుమంచి నియమాలు ఏమీ ఉండవు. పూజ చేసే సమయంలో మనసు ఇతరుల మీదకు మళ్లకుండా చూసుకోవాలి. స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని చేయడం ఉత్తమం. ఒకవేళ వీలుకాకపోతే, పవిత్రమైన భావనతో ఎప్పుడైనా చేయవచ్చు. కోపం, ద్వేషం వంటి వికారాలను వదిలి, ప్రేమతో శివుడిని స్మరించాలి. శరీరమే దేవాలయమని భావించి, లోపల ఉన్న శివుడిని దర్శించుకోవడమే ఇందులోని అసలైన నియమం.


