News September 3, 2024
హైకోర్టు ప్రాంగణంలోనూ కల్తీ ఆహారం
కల్తీ ఆహారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఏకంగా హైకోర్టు ప్రాంగణంలోనే ఫుడ్ లైసెన్సులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సంగతి రాజస్థాన్‌లో బయటపడింది. కుళ్లిన ఆలు, ఉల్లి, ఇతర ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, ఫ్రిజ్‌లో ఫంగస్, పాడైపోయిన గిన్నెలు, స్టౌవ్‌లు, గడువు ముగిసిన ఉత్పత్తులను అధికారులు గుర్తించారు. లైసైన్స్ పొందేవరకు ఆహారం అమ్మకుండా క్యాంటీన్ ఓనర్లపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News February 2, 2025
కుంభమేళా తొక్కిసలాటలో కుట్ర కోణంపై దర్యాప్తు
గత నెల 29న మహా కుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 30మంది మృతిచెందగా 60మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో కుట్రకోణం దిశలో యూపీ సర్కారు దర్యాప్తు చేయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 16వేలకు పైగా ఫోన్ నంబర్ల డేటాను అధికారులు విశ్లేషించారని, సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇక ఘటనపై దర్యాప్తుకోసం సర్కారు ఇప్పటికే త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
News February 2, 2025
నా అవార్డు మా నాన్నకు అంకితం: గొంగడి త్రిష
భారత్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారాన్ని తన తండ్రికి అంకితమిచ్చారు. ‘నన్ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదాలు. మాజీ ప్లేయర్ మిథాలీరాజ్ నాకు ఆదర్శం. అండర్-19 వరల్డ్ కప్ భారత్‌ను వదిలి వెళ్లకూడదని అనుకున్నాను. నా బలాలపైనే దృష్టి పెట్టి ఆడాను. దేశానికి మరిన్ని మ్యాచులు ఆడి గెలవాలన్నది నా లక్ష్యం’ అని తెలిపారు.
News February 2, 2025
రేపు పార్లమెంట్‌కు వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదిక
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రేపు వక్ఫ్ సవరణ బిల్లుపై నివేదికను JPC ఛైర్మన్ జగదాంబికా పాల్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించి ఆమోదించే అవకాశం ఉంది. ఇటీవలే ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన 44 సవరణల్ని జేపీసీ తిరస్కరించగా, NDA సభ్యులు ప్రతిపాదించిన 14 సవరణలను ఆమోదించింది. సవరణలకు 16 మంది మద్దతివ్వగా, 10 మంది వ్యతిరేకించారు.