News September 25, 2024
కల్తీ నెయ్యి వివాదం: ఏఆర్ డెయిరీపై కేసు

AP: తిరుమల లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై తిరుపతి ఈస్ట్ పీఎస్‌లో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నెయ్యి సరఫరాలో నిబంధనలు పాటించలేదని, ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 13, 2025
ప్రేమ అర్థాన్ని కోల్పోయింది: అజయ్ దేవగణ్

ప్రేమ అర్థాన్ని కోల్పోయిందని బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ అన్నారు. ‘ప్రేమ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. దాని డెప్త్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రతి మెసేజ్‌కు హార్ట్ ఎమోజీ పెడుతున్నారు. అన్ని మెసేజ్‌లు లవ్‌తో ముగుస్తున్నాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పెళ్లికి ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఉండాలని అజయ్ భార్య <<18269284>>కాజోల్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఇలా చెప్పడం గమనార్హం.
News November 13, 2025
క్యురేటర్‌తో గంభీర్, గిల్ సుదీర్ఘ చర్చ.. పిచ్‌పై అసంతృప్తి?

కోల్‌కతా వేదికగా రేపటి నుంచి భారత్, సౌతాఫ్రికా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ క్యురేటర్ సుజన్ ముఖర్జీతో కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్ సుదీర్ఘంగా చర్చించారు. ఇవాళ ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పిచ్‌ను కోచింగ్ టీమ్, BCCI క్యురేటర్లు, గిల్, పంత్ తదితరులు పరిశీలించారు. తర్వాత 30 నిమిషాలపాటు డిస్కషన్ జరిగింది. పిచ్ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
News November 13, 2025
ఐఫోన్ పెట్టుకునేందుకు ‘పాకెట్’.. ధర తెలిస్తే షాక్!

ఐఫోన్ పెట్టుకునేందుకు ‘యాపిల్’ కంపెనీ తీసుకొచ్చిన ‘ఐఫోన్ పాకెట్’పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఆ పాకెట్ ధర $229.95. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.20,390. ధర ఎక్కువగా ఉండటంతో పాటు దాని డిజైన్ సాక్స్‌ను పోలి ఉండటంతో ట్రోల్స్ మరింతగా పెరిగాయి. జపనీస్ ఫ్యాషన్ లేబుల్ ‘ఇస్సే మియాకే’ తో కలిసి ఈ పాకెట్‌ను రూపొందించినట్లు, పరిమిత సంఖ్యలోనే వీటిని విక్రయించనున్నట్లు యాపిల్ ప్రకటించింది.


