News September 20, 2024
కల్తీ నెయ్యి ఘటన.. దేవాదాయశాఖ అప్రమత్తం
AP: తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనతో ఏపీ దేవాదాయ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వినియోగించే ఆవు నెయ్యి నాణ్యత వివరాలను సేకరిస్తోంది. ప్రముఖ దేవాలయాల్లో ఆవు నెయ్యి కొనుగోళ్లపై ఆరా తీస్తోంది. దీనిపై త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసే యోచనలో దేవదాయశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 10, 2024
ఏపీలో పలువురు ఐఏఎస్లకు పోస్టింగ్, బదిలీలు
☞ ఆర్థికశాఖ కార్యదర్శిగా రోనాల్డ్ రాస్
☞ మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా కె.కన్నబాబు
☞ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా అనిల్ కుమార్ రెడ్డి
☞ కార్మికశాఖ, ఫ్యాక్టరీలు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అదనపు కార్యదర్శిగా గంధం చంద్రుడు
☞ వ్యవసాయ, సహకార శాఖ డిప్యూటీ సెక్రటరీగా డి.హరిత
News November 10, 2024
కులగణనకు మేము వ్యతిరేకం కాదు: బండి
TG: కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో కులగణన చేశారని, మళ్లీ అవసరం లేదని చెప్పారు. గత సర్వే నివేదిక ప్రస్తుత ప్రభుత్వానికి అందలేదా అని ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News November 10, 2024
మోదీ, షా నుంచే దేశానికి ప్రమాదం: ఖర్గే
భారత్కు మోదీ, షా నుంచే ప్రమాదం పొంచి ఉందని AICC చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తాజాగా వ్యాఖ్యానించారు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ కులాల ప్రాతిపదికన విభజిస్తోందని PM చేసిన విమర్శలపై ఆయన ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో స్పందించారు. ‘దేశాన్ని మతం, కులం పేరిట విభజించేది బీజేపీ వాళ్లే. మేం మనుషుల్ని ఏకం చేస్తాం. అలా ఏకం చేయడం కోసమే ఇందిర ప్రాణత్యాగం చేశారు. భారత్కు ముప్పు ఉందంటే అది బీజేపీ వల్లే’ అని మండిపడ్డారు.