News October 6, 2025
ప్రభుత్వ పెద్దల అండతోనే కల్తీ మద్యం రాకెట్: YCP

AP: కల్తీ మద్యం రాకెట్‌తో ప్రభుత్వ పెద్దలకు లింకులున్నాయని YCP నేత జూపూడి ప్రభాకర్‌రావు ఆరోపించారు. ‘టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. అందుకోసమే ప్రభుత్వ ఆధ్వర్యంలోని మద్యం షాపుల పాలసీని రద్దుచేశారు. ప్రభుత్వ పెద్దల అండ లేకుండా ఇదంతా జరుగుతుందా? CBN దీనిపై వివరణ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. జిల్లాల్లో కల్తీ లిక్కర్ డెన్లను ఏర్పాటుచేసి ఆదాయాన్ని వాటాలుగా పంచుకుంటున్నారని దుయ్యబట్టారు.
Similar News
News October 6, 2025
మేమంతా క్షేమంగానే ఉన్నాం: విజయ్

కారు <<17931879>>ప్రమాదంపై<<>> సినీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. అంతా క్షేమంగానే ఉన్నామని, ఎవరూ కంగారు పడొద్దని తెలిపారు. ‘కారుకు చిన్న ప్రమాదం జరిగింది. కానీ మేమంతా బాగానే ఉన్నాం. ఆ తర్వాత స్ట్రెంత్ వర్కౌట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాను. కాస్త తలనొప్పిగా ఉంది అంతే. బిర్యానీ తిని నిద్రపోతే అదే ఫిక్స్ అవుతుంది. మీ అందరికీ నా ప్రేమను పంపిస్తున్నా. ఈ వార్తతో ఎవరూ స్ట్రెస్ అవ్వొద్దు’ అని ట్వీట్ చేశారు.
News October 6, 2025
ఇది ధర్మాన్ని అతిక్రమించడమే: పవన్

AP: CJI గవాయ్‌పై లాయర్ దాడికి యత్నించడాన్ని Dy.CM పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ‘ప్రజల మనోభావాలను అర్థం చేసుకోగలను. కానీ ఇది ధర్మాన్ని అతిక్రమించడమే. చట్టానికి కట్టుబడి ఉండడమే సనాతన ధర్మం. పాషన్‌తో కాదు ప్రాసెస్‌తోనే న్యాయం జరుగుతుందని మన పురాతన గ్రంథాల్లో ఉంది. లక్షలాది మంది సనాతనీలకు అవమానం కలిగించే ప్రతి చర్యకు మేం వ్యతిరేకం. CJI గౌరవానికి జనసేన మద్దతుగా నిలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News October 6, 2025
CJIపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR <<17928232>>గవాయ్‌పై దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘దీనిపై గవాయ్ గారితో మాట్లాడాను. మన సమాజంలో అలాంటి చర్యలకు తావు లేదు. ఆ ఘటన ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. అలాంటి క్లిష్ట సమయంలో గవాయ్ శాంతంగా ఉండటాన్ని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.