News September 22, 2024

లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమే: రఘురామ

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా భక్తులు అంటున్న మాట వాస్తవమేనని MLA రఘురామకృష్ణరాజు అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్ల కోసం కల్తీ నెయ్యికి జగన్ అనుమతించారని ఆరోపించారు. 2019 వరకు శ్రీవారి ప్రసాదం జోలికి పాలకులు వెళ్లలేదని అన్నారు. ఇకపై స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసేలా CM చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

Similar News

News September 22, 2024

త్వరలో కొత్త పాఠ్యపుస్తకాలు

image

TG: నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్(NCF) ప్రకారం కొత్త పాఠ్య పుస్తకాలను విద్యాశాఖ దశలవారీగా రూపొందించనుంది. 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పుస్తకాల్లో మార్పులు చేశారు. అయితే 2023లో కేంద్రం విడుదల చేసిన ఎన్సీఎఫ్ ప్రకారమే కొత్త కరిక్యులం రూపొందించాల్సి ఉంది. తొలుత నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులకు, ఆ తర్వాత తెలుగు, హిందీ, ఉర్దూ వంటి భాషలకు కొత్త కరిక్యులాన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

News September 22, 2024

హెజ్బొల్లాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

image

మిలిటెంట్ సంస్థ హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు చేపట్టిన క్షిపణి దాడుల్లో 38 మంది మృతి చెందారు. ఇందులో హెజ్బొల్లా నెం.2 ఇబ్రహీం అకీల్ ఉన్నారు. మొత్తంగా సంస్థకు చెందిన 16 మంది కీలక కమాండర్లను హతమార్చింది. సంస్థ చీఫ్ నస్రల్లాతో పాటు మరో ఇద్దరు కీలక కమాండర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. తమ పౌరులకు హాని కలిగించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించింది.

News September 22, 2024

NPS వాత్సల్య స్కీమ్‌: నెలకు ₹833తో ₹11 కోట్లు

image

NPS వాత్సల్య స్కీమ్‌తో పిల్లలకు 60 ఏళ్లు వచ్చేసరికి రూ.11.05 కోట్లు చేతికొస్తాయని అంచనా. Ex. నెలకు ₹833/ఏటా ₹10వేలు 18ఏళ్లు జమచేస్తే పెట్టుబడి ₹1.8 లక్షలవుతుంది. దీనిపై 10% రిటర్న్ వస్తే ₹5లక్షలు అందుతాయి. అదే 60 ఏళ్లకైతే పెట్టుబడి మొత్తం ₹6 లక్షలు అవుతుంది. దీనిపై రిటర్న్ 10% అయితే ₹2.75 కోట్లు, 11.59%తో ₹5.97 కోట్లు, 12.86%తో ₹11.05 కోట్లు అందుతాయి. జమ చేసే డబ్బును షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు.