News October 14, 2024
‘కంగువ’ డబ్బింగ్ కోసం అధునాతన టెక్నాలజీ!

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ వచ్చే నెల 14వ తేదీన ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది. అయితే, దీనికోసం మూవీ టీమ్ డబ్బింగ్ ఆర్టిస్టును ఉపయోగించలేదు. దర్శకుడు శివ అతని బృందం అధునాతన AI సాంకేతికతను ఉపయోగించినట్లు సినీవర్గాలు తెలిపాయి. సూర్య వాయిస్‌ని ప్రతి భాషలో AI డబ్బింగ్ చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, ఈనెల 20న జరిగే ఆడియో లాంచ్‌కు సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రభాస్‌లను ఆహ్వానించినట్లు సమాచారం.
Similar News
News November 23, 2025
‘పీస్ ప్లాన్’ ఫైనల్ ఆఫర్ కాదు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏదో ఒక విధంగా ముగించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైన సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వార్ జరిగేది కాదని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు తాము ప్రతిపాదించిన 28 పేజీల <<18355334>>పీస్ ప్లాన్<<>> ఫైనల్ ఆఫర్ కాదని స్పష్టం చేశారు. కాగా US ప్రతిపాదించిన ప్లాన్ రష్యాకు మేలు చేసేలా, ఆ దేశం అడిగినవన్నీ జరిగేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 23, 2025
కల్కి ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు?

విష్ణువు ‘కల్కి’ అవతారంలో కలియుగం చివరిలో అవతరిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో ఇప్పటికే దాదాపు 5 వేల సంవత్సరాలు పూర్తయ్యాయి. కల్కి అవతారం సుమారు 4,27,000 సంవత్సరాల తర్వాత వస్తాడని కొందరు నమ్ముతారు. UPలోని శంభల గ్రామంలో జన్మిస్తాడని భవిష్యవాణిలో ఉంది. ధర్మ సంస్థాపన కోసం తన ఖడ్గంతో అందరికీ సమాధానం చెబుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి.
News November 23, 2025
‘కాళేశ్వరం’ బ్యారేజీల పునరుద్ధరణ.. DEC 5 నాటికి డిజైన్ కన్సల్టెంట్ ఎంపిక

TG: ఈ నెల 26కల్లా ప్రాధాన్య ప్రాజెక్టుల స్టేటస్‌పై వివరాలు సమర్పించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పునరుద్ధరణ కోసం డిజైన్ కన్సల్టెంట్ ఎంపికను వచ్చే నెల 5 నాటికి పూర్తి చేయాలని సూచించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ఏ ఎత్తుతో నిర్మిస్తే ఎంత ప్రయోజనం ఉంటుందో అధ్యయనం జరపాలని, డీపీఆర్ తయారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు.


