News October 7, 2024
నీట్ యూజీ పేపర్ లీకేజీకి అధునాతన టూల్ కిట్ వాడారు.. ఛార్జ్‌షీట్‌లో CBI

నీట్ యూజీ పేపర్ లీకేజీకి నిందితులు అధునాతన టూల్ కిట్‌ను ఉపయోగించి పరీక్ష పేపర్ల ట్రంక్ పెట్టెను తెరిచినట్టు CBI ఛార్జ్‌షీట్‌లో వెల్లడించింది. ఈ వ్యవహారంలో 144 మంది అభ్యర్థులు పేపర్ లీక్ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించినట్టు తెలిపింది. ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ ఒయాసిస్ స్కూల్ నుంచి పరీక్షకు కొన్ని గంటల ముందు పేపర్ లీకైనట్టు తేలింది. ప్రధాన నిందితులు సహా 49 మందిని అరెస్టు చేసింది.
Similar News
News December 13, 2025
ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. ఏర్పాట్లపై SEC ఆరా

APలోనూ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. పదవీకాలం ముగుస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ముందస్తు కార్యక్రమాలపై SEC నీలం సాహ్ని ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. సన్నాహాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మార్చితో, సర్పంచ్ల పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. కాగా TGలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
News December 13, 2025
ఆశపడి వెల్లుల్లితిన్నా రోగం అట్లాగే ఉందట

వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని, కొన్ని రోగాలను నయం చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఆ ఘాటును భరించి తిన్నా ఎలాంటి మార్పు లేకపోతే నిరాశే ఎదురవుతుంది. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఎంతో ప్రయాసపడి, కష్టపడి ప్రయత్నించినప్పటికీ, చివరికి ఫలితం శూన్యమైనప్పుడు లేదా పరిస్థితిలో పురోగతి లేనప్పుడు ఈ సామెతను సందర్భోచితంగా వాడతారు.
News December 13, 2025
బలి ‘గుమ్మడికాయ’తో ఇద్దామా?

అమ్మవార్లకు చాలామంది కోడి, మేకలను బలి ఇస్తారు. అయితే ఈ జంతు బలి కంటే కూడా గుమ్మడికాయ బలితోనే అమ్మవారు ఎక్కువ సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు. కూష్మాండాన్ని శిరస్సుకు ప్రతీకగా భావించి అమ్మవారికి దీన్ని సమర్పించాలని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ విధానమే శ్రేయస్కరమని చెబుతున్నాయి. అందుకే దసరాకి కూష్మాండాన్నే బలిస్తారు. ఇది హింస లేని, దైవ ప్రీతి కలిగించే ఉత్తమ మార్గం.


