News June 27, 2024
నిలకడగా అద్వానీ ఆరోగ్యం

అస్వస్థతతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కె.అద్వానీ(96) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనను వృద్ధాప్య విభాగం వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మూడు నెలల క్రితం ఆయనను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించింది.
Similar News
News April 6, 2026
పిరికివాడి మనస్తత్వం ఇలా ఉంటుంది!

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్ట విచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మేడిపండు చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ దాన్ని కోసి చూస్తే పురుగులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే పిరికివాడు పైకి చాలా ధైర్యంగా, గొప్పగా మాట్లాడుతాడు. కానీ మనసులో భయంతో నిండి ఉంటాడు.
<<-se>>#PADHYAM<<>>
News April 6, 2026
డ్రైవింగ్ లైసెన్స్ జారీకి త్వరలో కొత్త నిబంధన!

TG: డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుకు త్వరలో రోడ్ సేఫ్టీ టెస్టును తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి వీటి కంటే ముందు రోడ్ సేఫ్టీ టెస్ట్ నిర్వహించాలని ఆర్టీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ నివేదిక వచ్చాక కొత్త రూల్ అమల్లోకి వచ్చే అవకాశముంది.
News April 6, 2026
IPL: ఈరోజైనా KKR బోణీ కొడుతుందా?

ఐపీఎల్-2026లో ఈరోజు రా.7.30 గంటలకు కోల్‌కతా వేదికగా KKR, PBKS తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడగా 21 విజయాలతో KKR పైచేయి సాధించింది. కానీ ప్రస్తుత సీజన్‌లో KKR ఫామ్‌లో లేదు. ఇప్పటివరకు రెండు మ్యాచులాడి రెండింట్లోనూ ఓడింది. అటు పంజాబ్ ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది. మరి ఈరోజు విజయం ఎవరిదో కామెంట్ చేయండి.


