News March 29, 2024
172 స్థానాలకు ప్రకటన.. 3 పెండింగ్

AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మరో 3 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాలో జనసేన పోటీ చేసే మూడు నియోజకవర్గాలు పాలకొండ, విశాఖ సౌత్, అవనిగడ్డ ఉన్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ, జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ, బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 22, 2025
బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్‌ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్‌కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.
News November 22, 2025
‘పండ్లు, కూరగాయల సాగుతో ఎక్కువ లాభం’

నారింజ పంట ఉత్పత్తికి నాణ్యమైన విత్తనాల కోసం నాగ్‌పూర్‌లో రూ.70 కోట్లతో క్లీన్‌ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలను అందజేయడంపై ICAR సైంటిస్టులు దృష్టిపెట్టాలన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలను సాగు చేయాలని.. యంత్రాలు, డ్రిప్ ఇరిగేషన్ వాడకంపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.
News November 22, 2025
ఇంగ్లండ్ ఆలౌట్.. ఆసీస్ టార్గెట్ ఎంతంటే?

యాషెస్ సిరీస్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లిష్ బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే కట్టడి చేయడంలో ఆస్ట్రేలియా బౌలర్లు సక్సెస్ అయ్యారు. పోప్(33), డకెట్(28), జేమీ స్మిత్(15), అట్కిన్సన్(37), కార్స్(20) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 4, స్టార్క్, డగ్గెట్ చెరో 3 వికెట్లు తీశారు. విజయం కోసం ఆస్ట్రేలియా 205 పరుగులు చేయాల్సి ఉంటుంది.


