News October 14, 2025

రాష్ట్రంలో IT అభివృద్ధికి సలహా మండలి

image

AP: ప్రభుత్వం, స్టార్టప్స్, పారిశ్రామికవేత్తలను సమన్వయం చేసేందుకు IT సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి లోకేశ్ సహా ఇన్ఫోసిస్, IBM, TCS వంటి సంస్థల హెడ్‌లు, CII ప్రతినిధులు, ఎక్స్‌పర్ట్స్, విద్యారంగ, పరిశోధన సంస్థల ప్రతినిధులు వంటి వారికి చోటు కల్పించారు. అవసరం అనుకుంటే సబ్ కమిటీలు/టాస్క్ ఫోర్సులను సైతం ఏర్పాటు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది.

Similar News

News October 14, 2025

పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

image

ఒక టన్ను పశువుల ఎరువును పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19 KGల పొటాష్ పొలానికి అందుతాయి. గొర్రెలు, మేకల ఎరువు టన్ను వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్ భూమికి అందుతుంది. పొలంలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతోనూ భూసారం పెరుగుతుంది.

News October 14, 2025

APPLY NOW: ఐఐటీ ఇండోర్‌లో 16 పోస్టులు

image

ఐఐటీ ఇండోర్ 16 ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో పీహెచ్‌డీ, ఏదైనా ఐఐటీ నుండి డిజైనింగ్ డిప్లొమా/ ఆర్ట్స్/అప్లైడ్ ఆర్ట్స్‌ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiti.ac.in/

News October 14, 2025

ఇతిహాసాలు క్విజ్ – 35

image

1. రామాయణంలో రాముడు, సుగ్రీవులు ఏ కాండంలో కలుస్తారు?
2. పాండవులు అరణ్యవాసం ఎన్నేళ్లు చేశారు?
3. విష్ణువు మూడో అవతారం ఏది?
4. కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంతో కలసి ఉంటాడు?
5. కదళీ ఫలం అంటే ఏంటి?
* సరైన సమాధానాలను సాయంత్రం 6 గంటలకు పబ్లిష్ చేస్తాం. <<-se>>#Ithihasaluquiz<<>>