News February 8, 2026
AERAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(A<
Similar News
News February 20, 2026
ఏఐ సమ్మిట్‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో తెలుగు రాష్ట్రాల CMలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలతో CBN భేటీ కానున్నారు. ఉదయం ప్లీనరీ సెషన్‌లో, మధ్యాహ్నం WEF నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. మరోవైపు తెలంగాణ ఏఐ పాలసీపై CM రేవంత్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్‌లో ఏఐ అభివృద్ధికి చేస్తున్న కృషి, ప్రోత్సాహం, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులపై మాట్లాడనున్నారు.
News February 20, 2026
కోటి విద్యలకంటే కోరుకొని పొలం దున్నడం మేలు

లోకంలో వేల సంఖ్యలో విద్యలు, వృత్తులు ఉన్నాయి. ఎవరు ఏ ఉద్యోగం, పని చేసినా అది ఆహారం కోసమే. మనిషి ఎంత సంపాదించినా, ఎన్ని విద్యల్లో ప్రావీణ్యం సంపాదించినా ఆకలి తీర్చుకోవడానికి అన్నమే తినాలి. ఆ అన్నాన్ని పండించేది వ్యవసాయం మాత్రమే. కాబట్టి ఇతరుల దగ్గర బానిసలుగా, ఒత్తిడితో ఉద్యోగాలు చేయడం కంటే వ్యవసాయం చేస్తూ కష్టపడి బతకడం మేలని, ఇది మనిషికి మానసిక తృప్తిని, స్వేచ్ఛను ఇస్తుందని ఈ సామెత చెబుతుంది.
News February 20, 2026
సంతోషి మాత ఎవరు?

సంతోషీ మాత సంతృప్తికి అధిదేవత. గణపతి, రిద్ధి-సిద్ధిల కుమార్తెగా చెబుతారు. దుర్గమ్మే శాంతమూర్తిగా, కరుణామయిగా అవతరించిన రూపమని అంటారు. అమ్మవారి చేతిలో ఖడ్గం, త్రిశూలం ఉన్నా.. తన భక్తుల పట్ల ఎంతో మృదువుగా, దయతో ఉంటుంది. భక్తుల కష్టాలను స్వీకరించి, వారికి సంతోషాన్ని, ప్రశాంతతను ప్రసాదించడం వల్లే ఆమెకు ‘సంతోషీ మాత’ అనే పేరు వచ్చింది. అమ్మవారిని పూజిస్తే జీవితంలో అసంతృప్తి తొలగి సంతోషం కలుగుతుంది.


