News May 5, 2024

స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన అఫ్గాన్ రాయబారి

image

భారత్‌లో అఫ్గానిస్థాన్ తాత్కాలిక రాయబారి జాకియా వర్ధక్ బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. గత నెల 25న ఆమె రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా ముంబై విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. ఆమె ధరించిన ప్రత్యేక తరహా జాకెట్, లెగ్గిన్, బెల్ట్, మోకాలి క్యాప్‌లలో ఒక్కోటి కేజీ బరువున్న 25 బంగారు కడ్డీలు దొరికాయి. కాగా ఈ ఘటనతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

Similar News

News January 21, 2026

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ.. అంతా ఉత్తిదే!

image

సోషల్ మీడియాలో RGF(రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ) తెగ వైరలవుతోంది. ఓ యూట్యూబర్ చేసిన తుంటరి పని దీనికి కారణమని సమాచారం. హీరో రాజశేఖర్‌ను ఓనర్‌గా పేర్కొంటూ ఓ వీడియో చేయగా ఫేక్ అపాయింట్‌మెంట్స్, ఐడీ కార్డ్స్, శాలరీలు అంటూ పోస్టులు పుట్టుకొచ్చాయి. ఇందులో ఏదీ నిజం కాదని, ఒకరిని చూసి మరొకరు ట్రెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. యూట్యూబ్‌లో వచ్చే ఇలాంటి వీడియోలను గుడ్డిగా నమ్మొద్దని పలువురు సూచిస్తున్నారు.

News January 21, 2026

23వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ

image

TG: రికార్డు స్థాయిలో ఈ వారం 23 వేల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.261.51 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ ఎండీ గౌతం తెలిపారు. ఈ మార్చికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేయడంతో పాటు తదుపరి దశను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో రూ.4,351 కోట్లకు పైగా నిధులు విడుదల చేశామన్నారు.

News January 21, 2026

చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారా?

image

వాతావరణ మార్పుల వల్ల చర్మం తీవ్రంగా దెబ్బతింటోంది. అందుకే దాని పీహెచ్‌ సరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్‌ ఫిల్మ్‌ ఉంటుంది. దాని pH 4.5- 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వడం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. పీహెచ్‌ బ్యాలెన్స్‌డ్‌ ప్రొడక్ట్స్, సన్‌స్క్రీన్‌ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు.