News September 22, 2024

కోహ్లీ రికార్డును సమం చేసిన అఫ్గాన్ బ్యాటర్!

image

టీమ్ ఇండియా స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న ఓ రికార్డును అఫ్గాన్ బ్యాటర్ గుర్బాజ్ తాజాగా సమం చేశారు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అఫ్గాన్ రెండో వన్డే కూడా తాజాగా గెలిచింది. సెంచరీతో ఆ గెలుపులో గుర్బాజ్ కీలక పాత్ర పోషించారు. ఇది అతడికి ఏడో వన్డే సెంచరీ. 23 ఏళ్లలోపే ODIల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా విరాట్‌ రికార్డును సమం చేశారు. 8 సెంచరీలతో సఫారీ బ్యాటరీ డికాక్ అగ్రస్థానంలో ఉన్నారు.

Similar News

News September 22, 2024

ప్యూరిఫైడ్ వాటర్‌తో మెగ్నీషియం లోపం?

image

మెగ్నీషియం మన నరాల వ్యవస్థ పనితీరుకు, డయాబెటిస్, ఇస్కీమిక్ స్ట్రోక్ నివారణకు అత్యవసరం. ప్రకృతిసిద్ధంగా లభించే నీటిలో 10-20 శాతం మేర మెగ్నీషియం ఉంటుంది. కానీ నేడు వాడుతున్న ప్యూరిఫైడ్ లేదా మినరల్ వాటర్‌లో అన్ని మినరల్స్‌ను తొలగిస్తున్నారని ఇజ్రాయెల్ పరిశోధకులు తెలిపారు. దీంతో నీటి ద్వారా లభించాల్సిన మెగ్నీషియం మనకు అందడం లేదని, మినరల్ వాటర్ మృతజలాలతో సమానమని తాజా నివేదికలో హెచ్చరించారు.

News September 22, 2024

లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమే: రఘురామ

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత తగ్గిందని కొంతకాలంగా భక్తులు అంటున్న మాట వాస్తవమేనని MLA రఘురామకృష్ణరాజు అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నిజమేనన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్ల కోసం కల్తీ నెయ్యికి జగన్ అనుమతించారని ఆరోపించారు. 2019 వరకు శ్రీవారి ప్రసాదం జోలికి పాలకులు వెళ్లలేదని అన్నారు. ఇకపై స్వచ్ఛమైన నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేసేలా CM చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

News September 22, 2024

గూగుల్‌పై చర్యలకు సిద్ధమవుతున్న EU

image

యూరోపియ‌న్ యూనియ‌న్ నుంచి గూగుల్‌కు మ‌రో భారీ ఎదురుదెబ్బ త‌ప్పేలా లేదు. సెర్చ్ ఇంజిన్‌లో అన్ని సంస్థ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చే విష‌యంలో గూగుల్ వేగంగా స్పందించ‌క‌పోతే భారీ జ‌రిమానాతోపాటు బిజినెస్ మోడ‌ల్ మార్పుల‌పై ఆదేశాలు ఇచ్చే అవ‌కాశం ఉన్నట్టు EU అధికారులు చెబుతున్నారు. గూగుల్ ఫ్లైట్స్‌, హోటల్స్ వంటి స‌ర్వీసుల్లో గూగుల్ సెర్చ్‌లో చూపించే ఫ‌లితాల స‌ర‌ళికి వ్య‌తిరేకంగా ఈయూ ఛార్జిషీట్ సిద్ధం చేస్తోంది.